-
-
డబ్బులెవరికీ ఊరికే రావు - 2
Dabbulevariki Voorike Ravu 2
Author: Suryadevara Rammohana Rao
Publisher: Model Publications
Pages: 215Language: Telugu
హెూటల్ సెకండ్ ఫ్లోర్లోని రూఫ్గార్డెన్లో కార్నర్ టేబుల్ వద్ద కూచున్నాడు విశ్వాస్. ఎప్పుడు వచ్చినా అక్కడే కూచోడం అలవాటు. కామ్య నేరుగా అక్కడికి వచ్చేస్తుంది. అయితే లంచ్ ఆర్డర్ చేయలేదు. కాసేపు ఆగి రమ్మని వెయిటర్ని పంపించేసి కామ్య కోసం ఎదురు చూడసాగాడు.
రెండు నిముషాల్లో వచ్చేస్తానంది. రెండు కాదు ఇరవై నిముషాలయినా రాలేదు. ఎక్కడి కెళ్ళినట్టు? ఇంత సేపూ ఫోన్ మాట్లాడుతోందా లేక ఎక్కడికైనా వెళ్ళిందా? క్రమంగా ముప్పై నిముషాలయ్యేసరికి ఇక ఆగలేకపోయాడు విశ్వాస్. కిందికెళ్ళి చూసొద్దామని లేవబోతూండగా అప్పుడు... హడావుడిగా వచ్చి ఎదురుగా కూచుంది కామ్య.
“ఏమిటింత లేటు? ఎక్కడికెళ్ళావ్?” ఒకింత విసుగ్గా అడిగాడు విశ్వాస్.
“చెప్తా. లంచ్ ఆర్డర్ చేసావా లేదా?” అడిగింది.
“ఆర్డర్ చేసుంటే ఐటమ్స్ చల్లారిపోయేవి. నువ్వే చెప్పెయ్” అంటూ వెయిటర్ని పిలిచాడు.
ఏం కావాలో ఆర్డర్ చేసి వాడ్ని పంపించేసాక-
విశ్వాస్ వంక చూసి నవ్వింది కామ్య.
“ఒక్కోసారి అదృష్టం ఎదురొచ్చి మనకి శ్రమ తగ్గిస్తుంది. ఇప్పుడు నా విషయంలో అదే జరిగింది. అనుకోకుండా ఒక చిక్కు ప్రశ్నకి సమాధానం దొరికింది. అందుకే లేటు” అంది.
అర్థంగానట్టు చూసాడు విశ్వాస్.
“ప్రశ్న ఏంటి సమాధానం ఏంటి?” అడిగాడు.
“ప్రశ్న... బ్యాంకర్ నిషాంత్ కశ్యప్నే ఎందుకు టార్గెట్ చేసాడన్నది ప్రశ్న”
“మరి... సమాధానం?”
“నో... ఇప్పుడు చెప్పను”
“అదేమిటి?”
“అదంతే. నీకసలే ఆవేశం ఎక్కువ. ఆపైన నోటి దురుసూ ఎక్కువే. ఇప్పుడు చెప్పానంటే ఎక్కడో బరస్ట్ అవుతావ్? దానివల్ల చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. అందుకే ఇప్పుడు చెప్పనంటున్నాను. సమయం వచ్చినప్పుడు నేనే చెప్తాను. ముందు భోంచేస్తే త్వరగా ఎయిర్పోర్ట్ కెళ్ళొచ్చేద్దాం”
“అదికాదు కామ్యా...”
“ఇంకేం చెప్పకు. మీల్స్ వచ్చేసింది. భోం చేద్దాం”
వెయిటర్ తెచ్చినవన్నీ నీట్గా టేబుల్ మీద సర్ది వెళ్ళిపోయాడు. అలిగినట్టు ముఖం ఉంచి కామ్యతో బాటు తనూ భోజనానికుపక్రమించాడు విశ్వాస్.
అద్భుతం అనే మాటకు అర్థం.. ఈ నవల.. ఆ perfect story.. perfect ending.. one of the best novels of i have read..👍👌💐.. dont miss..