-
-
డబ్బు సంపాదించడం ఓ కళ
Dabbu Sampadinchadam O Kala
Author: Saili
Publisher: Victory Publishers
Pages: 60Language: Telugu
విత్తు నాటగానే చెట్టురాదనేది ఎంత నిజమో అలాగే సంపద కావాలి అనగానే రాదు అనడమూ అంతే నిజం. సంపాదనలో కూడా కొన్ని దశలు వుంటాయి. అవి: ప్రారంభదశ, మధ్యదశ అంతిమదశ.
ప్రారంభదశలో మిమ్మల్ని మీరు పోషించుకునేందుకు, మీ కాళ్లపై మీరు నిలబడేందుకు కృషిచేయాలి. మధ్యదశలో మీవాళ్ళనీ, మీ కుటుంబాన్ని పోషించడానికి కష్టపడాలి.
అలాగే ఇక చివరి అంతిమదశలో సమాజంకోసం, దేశంలోని బడుగు బలహీనులకోసం సంపాదించాలి. అంటే ఆ చివరి దశకు చేరాలంటే ముందు విత్తనం బాగా నాటాలి. దానికి తగిన ప్రణాళిక వేయాలి. విత్తనం మొక్కగా మారేందుకు కావాల్సిన అన్ని చర్యలు చేపట్టాలి.
అంటే కోరిక అనే విత్తనాన్ని సాధ్యం అనే మొక్కగా మార్చడానికి ఎంతో కృషి పట్టుదల అవసరమని అర్థం. అప్పుడే అది దశల వారిగా మొక్కై మహా వృక్షమవుతుంది. లేదా విత్తనంలానే కోరిక మెదడులో ఉండిపోయి నిర్వీర్యమవుతుంది.
ఆ ఆశ నిరాశగా మారుతుంది. అందుకని డబ్బు సంపాదించడానికి ప్రతీ దశలో ఆ దశ రీత్యా కృషి శాతాన్ని పెంచుకుంటూ పోవాలి. ధైర్యే సాహసే లక్ష్మీ. అంటే ధైర్యం చేసేవారిని లక్ష్మీదేవి వరిస్తుందని అర్థం. లక్ష్మీ దేవి అంటే విజయ లక్ష్మీ, ధనలక్ష్మీ, ధాన్య లక్ష్మీ ఇలా అన్ని లక్ష్మీలు వస్తాయి. వరిస్తాయి. ధైర్యం చెయ్యలేని వాని దగ్గర డబ్బు ఉండదు.
డబ్బు సంపాదించాలంటే ధైర్యం చేయాల్సిందే . ధైర్యంతో తెలివిని, ఆలోచనని జత చేస్తే ఇక ధనలక్ష్మీ తప్పక వరిస్తుంది.
