-
-
కౌన్సెలింగ్ విజయాలు
Counselling Vijayalu
Author: Dr. T. S. Rao
Publisher: Victory Publishers
Pages: 210Language: Telugu
కౌన్సిలింగ్ సైకాలజిస్ట్‌గా పాతిక సంవత్సరాల పైబడి నాకున్న అనుభవంలో కొన్ని వేలమంది క్లయింట్లతో, వారి సమస్యల పట్ల నాకు అవగాహన ఉంది. ప్రతినిత్యం నావద్దకు వచ్చే క్లయింట్లలో సాధారణంగా ఎక్కువమందిని బాధించే సమస్యలను, వాటికి నేను ఎలాంటి పరిష్కారాలను సూచించానో నా అనుభవాలను ఈపుస్తకం ద్వారా చర్చిస్తున్నాను.
ఈ పుస్తకం నిత్యజీవితంలో సైకాలజీ గురించి తెలుసుకోవాల్సిన అవసరం గురించి చెబుతుంది. కౌన్సిలింగ్ అంటే ఏమిటో చెబుతుంది. వివిధ దశల్లో కౌన్సిలింగ్ ఎలా జరుగుతుందో చెబుతుంది. ఏ తరహా మానసిక సమస్యకు ఎటువంటి కౌన్సిలింగ్ ఇవ్వాలో చెబుతుంది.
ఈ పుస్తకం కాబోయే సైకాలజిస్టులకు హాండ్‌బుక్ గా ఉపయోగపడుతుంది. సైకాలజీపై అభిరుచి ఉన్న పాఠకులకు వివిధ మానసిక సమస్యలను గురించి, వాటికి కౌన్సిలింగ్ ఇచ్చే పద్ధతుల గురించి తెలియజేస్తుంది. ఇందులో సైకాలజీతో పాటు ఇతర ఆరోగ్య సమస్యల కారణంగా వచ్చే మానసిక సమస్యలకు ఇచ్చే కౌన్సిలింగ్ పద్ధతుల గురించి కూడా ప్రస్తావించాను.
పఠనీయతను పెంచేందుకు గాను ఈ పుస్తకంలో నేను పరిష్కరించిన మానసిక సమస్యల గురించి, కొందరు క్లయింట్లను గురించి చెప్పాను. గోప్యతను పాటించడం కోసం క్లయింట్ల పేర్లను మార్చడం జరిగింది. సమస్యలు, సన్నివేశాలు మాత్రం నిజమైనవి.
కౌన్సిలింగ్‌కు ఏ సమయంలో రావాలి?ముందు జాగ్రత్త చర్యలేమిటి వంటివి కూడా ఇందులో పొందుపర్చాను. అలాగే ఒక మానసిక సమస్య మొదలైన దశలో దానిని గుర్తించేందుకు వివిధ మానసిక సమస్యల లక్షణాలను గురించి కూడా చెప్పాను. పరిపూర్ణత్వం సాధించడం సాధ్యం కాదు. కానీ ఎంచుకున్న విషయాలన్నింటినీ సమగ్రంగా చెప్పాననే తృప్తి ఉంది.
- డా. టి.యస్.రావు
