• Coronostalgia - free
 • A small request. Just a few seconds. Click any button here to share your Telugu eBook store Kinige.com with your friends & family. Thank you.
  • fb
  • Share on Google+
  • Pin it!
  Ebook Hide Help
 • కరోనొస్టాల్జియా (free)

  Coronostalgia - free

  Author:

  Pages: 197
  Language: Telugu
  Rating
  4.96 Star Rating: Recommended
  4.96 Star Rating: Recommended
  4.96 Star Rating: Recommended
  4.96 Star Rating: Recommended
  4.96 Star Rating: Recommended
  '4.96/5' From 26 votes.
  0 Star Rating: Recommended
  0 Star Rating: Recommended
  0 Star Rating: Recommended
  0 Star Rating: Recommended
  0 Star Rating: Recommended
  '0/5' From 0 premium votes.
Description

నిన్నటి తీపి జ్ఞాపకాలు నేటి చేదు అనుభవాలను మరిపిస్తాయి.

గతంతో పెనవేసుకున్న అనుబంధాలు వర్తమానంలోని ఒంటరితనాన్ని పోగొడతాయి.

సమస్యనూ, సవాళ్లనూ ఎదుర్కొనే కొత్త శక్తిని చేకూరుస్తాయి.

అదే నోస్టాల్జియా..

ఇదో జ్ఞాపకాల చికిత్స. గతానుభూతుల వైద్యం.. అమ్మ కొంగులాంటి లాలన.. నాన్న భుజం లాంటి ఆసరా.. 'కుంగుబాటునూ, ఒంటరితనాన్నీ అధిగమించడడానికి మెదడు ఏర్పాటుచేసుకున్న గొప్ప రోగ నిరోధక వ్యవస్థ ఇది అంటారు పరిశోధకులు.

గ్రీకు భాషలో నోస్టోస్ అంటే 'ఇంటికి తిరిగి వెళ్లాలన్న' ... అల్గోస్ అంటే బాధ అని అర్థం. మొత్తంగా ఇదో ప్రవాస వ్యధ. ఉపాధి వెతుక్కోడానికో, ఉనికి చాటుకోడానికో ఊరి పొలిమెర, దేశ సరిహద్దూ దాటి వెళ్లినవారిలో ఏదోక సమయంలో మొదలయ్యే మూలాల గురించిన బెంగ ఇది.

సంపాదనలూ, పదోన్నతులూ, సొంతిళ్లూ, పేరు ప్రఖ్యాతుల కోసం పెట్టిన పరుగులన్నీ ఓ కొలిక్కి వచ్చిన తర్వాత మనిషిని ఓ మోస్తరు శూన్యం ఆవరించేస్తుంది. ఆబగా ఆకాశానికి నిచ్చెనలేస్తున్నవాడిని కాస్తా తీవ్ర వైఫల్యాలో, విధి వైపరీత్యమో మెడ పట్టుకుని నేల మీదకు లాక్కొచ్చేస్తాయి. అప్పుడే మన అనువర్తనలోని డొల్లతనాలు బయటపడతాయి. నిన్నటిదాకా గొప్పగా అనిపించినవీ, మహాద్భుతంగా తోచినవీ కృతకమేనన్న సత్యం బోధపడుతుంది. నోస్టాల్జియా ఆ శూన్యాన్ని భర్తీ చేస్తుంది.

కరోనా మహమ్మారి తరుముతున్న వేళ ఈ ప్రపంచమంతా తన పరుగును ఆపేసి ఒకసారి వెనక్కు తిరిగి చూసుకుంటోంది. అభివృద్ధి పేరుతో ఆకాశానికి నిచ్చెనలేస్తున్న మనిషి ఒకసారి ఆగి తన మూలాల్లోకి తొంగి చూసుకోవలసిన పరిస్థితి వచ్చింది.

ఉపాధి కోసం ఊళ్లు, దేశాలు దాటి వెళ్లిన వలస కార్మికులు కానీ.. ఏదో సాధించాలన్న తాపత్రయంలో విదేశాలకు చేరిన మన బిడ్డలు కానీ.. కరోనా విపత్తు వేళ భ్రమలు తొలగిపోయి.. సొంతూరు మీద, అయినవాళ్ల మీద మనసు మళ్లి వేలాది కిలోమీటర్ల దూరం కూడా ఎలాగోలాగ వెళ్లిపోవడానికి సిద్ధపడ్డారంటే దానికి కారణం ఇదే. నోస్టాల్జియా - ఓ జ్ఞాపకాల చికిత్స... గతానుభవాల వైద్యం...

ప్రపంచాన్ని ఓ మహమ్మారి వణికిస్తున్న వేళ.. ఈ భూమండలం మొత్తం.. ప్రతీ దేశం.. ప్రతీ వ్యక్తీ ఓసారి వెనక్కు తిరిగి చూసుకోవలసిందే.. అలాంటి యత్నమే ఇది..

- వెంకూ

Comment(s) ...

కరోనా న్యూస్ వస్తుంటేనే న్యూస్ ఛానెల్ మార్చేస్తున్న ఈ తరుణంలో కరోనా నే సబ్జెక్ట్ గా తీసుకొని, దానిలో మీ బయోగ్రఫీ ని మిళితం చేస్తూ ఆధ్యంతం మక్కువ కలిగించేలా మీరు వ్రాసిన తీరు అదరహో....
అంతే కాకుండా కరోనా గురించి గణాంకాలతో సహా పొందుపరిచిన సమాచారంతో మాలాంటి వారికి విజ్ఞాన సముపార్జన కూడా....
మీరు ఇలానే ఇంకా ఎన్నో పుస్తకాలు వ్రాయాలని మనఃపూర్వక అభినందనలు వెంకూ సర్

పాత్రికేయుడు వెంకూ..
తన స్వీయ చరిత్రను, కుటుంబ నేపథ్యాన్ని.. ఓ మినీ ఆత్మకథలా మేళవించి.. కథ అని కాకుండా.. పూర్తి కల్పనా కాకుండా అధివాస్తవికతలా చేసిన ఓ చిన్న ప్రయోగం.. కరోనోస్టాల్జియా... Really excellent

One of the wonderful books I have read recently. Venku the authored was very nicely align d lot of memories into a meaningful story in this book. I recommend everyone read at least once. It is worth!

Wonderfull,Hood information with dromstic Ritym

చాలా బాగుంది సార్....

మహాద్భుతం

వెంకూ సర్ గారి జీవితానుభవాల సమ్మిశ్రమం ఈ పుస్తకం. కరోనా వ్యాధి గురించి విపులంగా చర్చించడంతో పాటు ఎన్నో విలువైన విషయాలను మనతో పంచుకున్నారు. కష్టాలతో సహవాసం, కళతో అనుబంధం, పాత్రికేయం మీద ప్రేమ, ఆధ్యాత్మికత మీద నమ్మకం, కష్టం మీద గౌరవం, సమాజం పట్ల వాస్తవ దృక్పథం కలిగిన ఆయన అనుభవాలు మనకు విలువైన పాఠాలు.

పాత్రికేయుడు వెంకు గారికి ధన్యవాదాలు మంచి విషయాలు అందించినందుకు

వెంకూ గారికి శుభాభినందనలు.
మీ కలం నుంచి జాలువారిన అక్షర విస్తార మాలను పూర్తిగా చదివాను.
చాలా బాగుంది.
ప్రక్షిప్త భావన రాకుండా సహజ శైలిలో ఆటోబయాగ్రఫీ కాంటెంపరరీ సోషియాలజీని ఒకతాటిపై నడిపించడం సింప్లీ సూపర్బ్.

చక్కని పాయసానికి కుంకుమ పువ్వు చేర్చడంతో సహజ వర్ణం, ఘుమఘుమల సుగంధం జత అయినట్లుగా... చివరి పేపర్లో మీ "నందనం" లో అమర్చిన "వాల్ పేపర్" పిక్కు మధ్యన *వెంకూ* చిత్రమును చేర్చి ఉంటే... ఆ పరిమళం మరింత ఘనంగా కళ్ళకు కట్టినట్లుగా, భావి పాత్రికేయులకు ఒక దిశానిర్దేశం చేసేదిగా ఉండేదేమో!!

మరొక్కసారి శుభాకాంక్షలు, శుభాశీస్సులు.
మిత్రుడు
పంతంగి రమాకాంత శర్మ

కరోనా గురించి పేపర్లో వచ్చే వార్తలు చదవాలంటే కాస్త బెరుకు ఉంటుంది.. కొంతమంది ఆ వార్తలను చదివేందుకు కూడా ఇష్టపడరు .. అయితే కష్టకాలంలో ధైర్యం చెప్పే మిత్రుడిలా .. తీపి జ్ఞాపకాలను మేళవించి చేదు అనుభవాలను మరిపించేలా , భయం నిండిన మా మెదడులోని ప్రశ్నలకు అభయం ఇచ్చే సమాధానం లా ఈ కారోనోస్టాల్జియా ను వెంకు గారు తీర్చిదిద్దారు. పూర్తి కల్పన కాకుండా స్వీయ చరిత్రను, కుటుంబ నేపథ్యాన్ని మేళవించిన అద్భుతం .. ప్రతి ఒక్కరు చదవాల్సిన పుస్తకం ఇది ..

కరోనా గురించిన వివరాలు లోతుగా వివరిస్తూ.... మధ్య మధ్యలో రచయిత తన జ్ఞాపకాలను, బాల్యం నుంచి తన జీవితంలో జరిగిన సంఘటనలను వివరించిన తీరు 👌. వారు వివరించిన విధానం, మనం కూడా వారితో పాటు వారి బాల్యంలోకి వెళ్ళిపోయి ఆయా ప్రదేశాలను తిరిగి, ఆ మధురానుభూతులను, కొన్ని కష్టాలను కూడా అనుభవించిన ఫీలింగ్ కలుగుతుంది. ప్రతి ఒక్కరు చదవతగ్గ పుస్తకం. ధన్యవాదాలు వెంకు గారు 🙏🙏🙏

It’s a good effort with in short time

కరోనొస్టాల్జియా: Venku Eenadu గారు రాసిందని చెప్పటం కన్నా కరోనా పుట్టు పూర్వోత్తరాలు మొత్తం తన జర్నలిస్టు మనోనేత్రంతో చూసి రాశారని చెప్పొచ్చు...
1. అసలేంటీ కరోనా
2. అది వచ్చాక ఏం జరిగింది, రాక ముందు ఏం జరిగింది
3. గతంలో ఇటువంటి వైరస్‌లు వచ్చాయా,
4. వైరస్ చైనాలో వచ్చాక పరిస్థితి ఏంటి
5. ప్రపంచంలో పరిస్థితి ఏంటి
6. జర్నలిస్టులు ఈ కరోనా కాలంలో ఎలా పనిచేశారు
7. ఎన్ని ఉద్యోగాలు పోయాయి
8. అంతా నష్టమేనా, బాగుపడ్డారు అనేందుకు ఎవరున్నారు
9. ప్రభుత్వాలు ఎలా పని చేశాయి
....... ఇలా చెప్పుకుంటూ పోతే మీకు ఈ 9 నెలల ప్రపంచాన్ని 200పేజీల పుస్తకంలో అందించారు రచయిత వెంకూ గారు. I am sure you can know the best info. ముఖ్యంగా ఈ పుస్తకం చదువుతున్నంతసేపు బోర్ అన్నది ఏ క్షణాన ఉండదని మాత్రం చెప్పగలను. Best information ఉంది..👍 మీ కలం

wonderful.. every one must read this book.. top to bottom all issues covered... congratulations to the author sri venku garu 🙏🙏🙏🙏

హెడ్డింగులతో.. కావలసిన చోట చదువుకునే వెసులుబాటిచ్చారు... అయితే కొంత ముందుకెళ్ళిపోయినా.. దీని గురించి ఎక్కడ చెప్పారబ్బా అని.. మళ్ళీ వెనక్కెళ్ళి అంతా చదివేలా రాశారు.. మీ పుస్తకం అద్భుతం.. 😍

this book is nicely presented regarding corona virus from dec 2019 to august 2020 and additional for a change personnel life details also added.this is first book in my life i read completely may be due to know about corona ,In
80's when i am young i tried to read yandamuri novels like challenge ,abilasha,tulasi.

గొప్ప ప్రయత్నం, ఆద్యంతం చదివించే మంచి శైలి.

కరోనా పుట్టుపూర్వోత్తలు గురించి మీరు రాసిన పుస్తకం చదవడం వల్ల నేను చాలా ఉపయోగకరమైన విషయ పరిజ్ఞానం మీ ద్వారా తెలుసుకోవడం జరిగింది. అయితే ఈ మహమ్మారి ప్రపంచంలోనే కాకుండా మన చుట్టూ ఉన్న వారిని కొంతమందిని కబళించడం తీవ్రంగా తన మనసుకు గాయం అయ్యింది.ఇది అక్షర సత్యం .మీరు రాసిన ఈ పుస్తకం చాల మందికి మంచి అవగాహన కలిగించింది. నేటి నిజజీవితంలో మనిషి ఆరోగ్యం కోసం తప్పనిసరి పరిస్థితుల్లో జాగ్రత్తలు తీసుకోవాలని సందేశాన్ని మీరు రాసారు,నిజానికి ఉదయం నుండి రాత్రి వరకు మనిషి పరుగులు తీస్తున్నా ఈ రోజుల్లో మీరు ప్రజలకు అందుబాటులో ఉంచిన ఈ పుస్తకం చదవడం తప్పనిసరి, ప్రతిఒక్కరు చదివి తెలుసుకోవలసిన అవసరం ఉందని నా అభిప్రాయం. మీరు ఈనాడు పత్రికలో డిప్యూటీ ఎడిటర్ గా చేస్తు ,ప్రజలకు కోసం ఇంతమంచి పుస్తకం రాయడం నిజంగా మీకు ఎల్లప్పుడూ కృతజ్ఞత తెలియజేస్తూ..... మీ పాణిగ్రాహి. నా రేటింగ్ 5 పాయింట్లు ఎందుకు అంటే ఇది ప్రతి ఒక్కరూ చదవటంవల్లన ,మంచి పరిజ్ఞానం తెలుస్తోంది. అలాగే మరోసారి మీకు నా అభినందనలు తెలియజేస్తున్నా వెంకూ సర్.

S N Panigrahi

Caronostorica is a wonderful book for telugu readers. Author given very detailed information about CORONA. Excellent writing skills and interpretation are the added flavour to the current situation in the world. Really it is a good book. Thank the author to given an opportunity to read every one.

గత జ్ఞాపకాలు, వలస కార్మికుల కష్టాలు ప్రపంచం ఎదుర్కుంటున్న సవాళ్లు గురించి చాలా చక్కని రచనలు రాశారు.....
రచయిత గారు👌🏼

Superb writing.... every one should be read ...

A Big clap to author.......