-
-
కంప్యూటరు నిఘంటువు
Computeru Nighantuvu
Author: Praveen Illa
Publisher: Suravara Language Technologies
Pages: 96Language: Telugu
Description
గత పది సంవత్సరాలుగా తెలుగు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అనేక తెలుగు పదాలను వారి నెట్-జీవితంలో భాగం చేసుకున్నారు. అంతర్జాలం, వేగు, ఖతి ఇటువంటి మంచి, వాడదగ్గ తెలుగు పదాలను మరింత మందికి చేర్చే ప్రయత్నమే ఈ కంప్యూటరు నిఘంటువు.
ఇందులో 1900కు పైబడి ఆంగ్ల సాంకేతిక పదాలకు భేషైన తెలుగు పదాలు, వివరణలు సోదాహరణంగా ఇచ్చాము. చదివి వీటిని ఆస్వాదించండి. అక్కున చేర్చుకోండి. సాంకేతిక విప్లవానికి తెలుగు భాషను మరింత దగ్గర చేయండి.
Preview download free pdf of this Telugu book is available at Computeru Nighantuvu
నిఘంటు నిర్మాణం కష్టతరం. అనుభవం ఉండాలి. ఓర్పు ఉండాలి. ఇతరులు రాసిన రాతలతోటీ, చేసిన ప్రయోగాల తోటీ పరిచయం ఉండాలి. కాని ఎవ్వరో ఒకరు ప్రయత్నం చెయ్యక పోతే ఎలా? అందుకని ఈ ప్రయత్నాన్ని మెచ్చుకుంటున్నాను. నాకు చేతనయినంత మేరకి ఇందులో దొరికిన కొన్ని కొత్త మాటలని వాడి చూస్తాను. ఈ ప్రయోగం పలుకుతుందో లేదో ప్రజలే నిర్ణయించాలి. పుస్తకం తయారీ బాగుంది. చదవడానికి తేలికగా ఉంది. ఇలాంటి ప్రయత్నాలని మనమే ప్రోత్సహించాలి.
- వేమూరి వేంకటేశ్వరరావు
http://lolakam.blogspot.in/2013/07/blog-post.html