-
-
కమ్యూనిస్టు పార్టీ ఎలా ఉండకూడదు?
Communistu Party Ela Vundakudadu
Author: Ranganayakamma
Publisher: Sweet Home Publications
Pages: 250Language: Telugu
'వైల్డ్ స్వాన్స్' పేరుతో యుంగ్ చాంగ్ రాసిన; 'అడవిగాచిన వెన్నెల' పేరుతో వెనిగళ్ళ కోమల అనువాదం చేసిన పుస్తకానికి విమర్శనాత్మక పరిచయం ఇది.
* * *
శ్రమ దోపిడి సాగుతోన్న సమాజాన్ని దోపిడి లేని సమాజంగా మార్చుకోవలసిన బాధ్యత శ్రామిక వర్గానిదే. ఈ వర్గం, రాజ్యాధికారాన్ని సాధించే దశ కన్నా, తర్వాత సమాజాన్ని మార్చుకునే దశలే అత్యంత కష్టమైనవి.
అమలులో వున్న ఈ సమాజం ఎందుకు మారాలి? ఇందులో వున్న తప్పులు ఏమిటి? ఈ సమాజం ఎందుకు వద్దు? ఇది మారాలంటే, ఎలా మారాలి? ఎక్కడి దాకా మారాలి? ఎక్కడ ఆగాలి? - శ్రామిక ప్రజలకు ఇదంతా ఎప్పుడో తెలియడం కాదు. ఇప్పుడే తెలిసి వుండాలి.
శ్రమ దోపిడి మీద పోరాటం వ్యక్తులుగా, ఒంటరిగా చేసేది కాదు. సమిష్టిగా, శ్రామిక సంఘాల శిక్షణతో చేసేది.
కమ్యూనిజం కోసం, కమ్యూనిస్టు సంఘం (పార్టీ) అత్యవసరం. సంఘం లేకుండా సమిష్టి పోరాటమే అసాధ్యం. సంఘ జీవితంలో నిబంధనలూ, కర్తవ్యాలూ, ఆదర్శాలూ పెనవేసుకుని వుంటాయి. సంఘ జీవితం, వ్యక్తుల్ని పాత తప్పుడు భావాల నించి విముక్తం చేస్తుంది; పరిశుభ్రం చేస్తుంది.
శ్రామిక ప్రజలు, శ్రామిక సంఘాల ద్వారానే, తమని తాము అభివృద్ధి పరుచుకుంటూ, సమాజాన్ని విప్లవ మార్గం వేపు తిప్పాలి.
కమ్యూనిస్టు సంఘం ఎలా ఉండాలో తెలుసుకోవడం, అది ఎలా ఉండకూడదో తెలుసుకోవడం కూడా!
