-
-
కమ్యూనిస్టు విప్లవకారుల జీవన విధానం
Communist Viplavakarula Jeevana Vidhanam
Author: Devulapalli Venkateswara Rao
Publisher: Porunela Prachuranalu
Pages: 98Language: Telugu
కమ్యూనిస్టు, కమ్యూనిస్టు విప్లవకారుల పార్టీల్లో, సంస్థల్లో సిద్ధాంత, రాజకీయ క్లాసులను నిర్వహిండడం వారి కార్యకలాపాల్లో భాగంగానే ఉంటుంది. కా. దేవులపల్లి వెంకటేశ్వరరావుగారు నిర్వహించిన “ఓరియంటేషన్” క్లాసులు మాత్రంపై క్లాసులకు పూర్తిగా భిన్నమైనవి. కమ్యూనిస్టు విప్లవకారులకు ఒక సరైన విప్లవ కార్యక్రమం, పంథాలు ఉండటం తప్పనిసరి. కా. దేవులపల్లి వేంకటేశ్వరరావు ప్రధానంగా తెలంగాణ సాయుధ పోరాట అనుభవాలతోపాటుగా, నక్సల్బరీ శ్రీకాకుళ పోరాట అనుభవాలను ఆధారంగా చేసుకొని 1969 – 72 మధ్య కాలంలో ఆ విధమైన కార్యక్రమం, పంథాలను రూపొందించి, అభివృద్ధి పరిచినాడు.
కమ్యూనిస్టు విప్లవ కారుల జీవన విధానం పైన, అది ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా ఉండకూడదు అనే విషయాన్ని పై క్లాసుల్లో చాలా వివరంగా చెప్పారు. ప్రస్తుతం, ఇప్పుడు మేం ప్రచురిస్తున్న ఈ పుస్తకం ఆ క్లాసుల్లో వివరించిన కమ్యూనిస్టు విప్లవకారుల జీవన విధానం గురించిన మాత్రమే.
కమ్యూనిస్టు విప్లవకారులు మనుష్యులే అయినప్పటికీ, వారు ఇతర ప్రజల్లాగే సాధారణ జీవితాలను గడిపితే, విప్లవోద్యమాన్ని నిర్మించిముందుకు తీసుకువెళ్ళలేరు. అందుకోసం వారు తమని తాము ఒక ప్రత్యేక తరహా మనుష్యులుగా బోల్షివిక్లుగా తీర్చిదిద్దుకోవలసి ఉంటుందనేదే ఆనాటి క్లాసుల్లో కా. డి.వి. చెప్పిన ప్రధానమైన విషయం. పార్టీ శ్రేణులు తమని తాము ఆ విధంగా తీర్చిదిద్దుకోవడానికి తోడ్పడే విధంగా 14 అంశాలను గురించి ఆయన వివరించారు.
- ప్రచురణ కర్తలు

- ₹240
- ₹108
- ₹216
- ₹118.8
- ₹162
- ₹60
- ₹240
- ₹108
- ₹216
- ₹118.8
- ₹162
- ₹60