-
-
కమ్యూనిష్టు పార్టీ ప్రణాళిక - పరిచయం
Communist Party Pranalika Parichayam
Author: Ranganayakamma
Publisher: Sweet Home Publications
Pages: 135Language: Telugu
• "యూరప్‌ని ఒక భూతం ఆవహించింది. 'కమ్యూనిజం' అనే భూతం!"
• ఆస్తి వ్యవస్తను మేము రద్దు చేయదలుచుకున్నందుకు మీరు మమ్మల్ని నిందిస్తున్నారన్నమాట. ఔను, సరిగ్గా అదే మేము చేయదల్చుకున్నది.
• వ్యక్తిగత ఆస్తిని రద్దు చేయాలనడం, మీకు వెలపరం పుట్టిస్తున్నది. కానీ, ఇప్పుడున్న మీ సమాజంలో, నూటికి తొంభై మందికి వ్యక్తిగత ఆస్తి ఇప్పటికే రద్దయిపోయింది. నూటికి తొంభై మందికి ఆస్తి లేదు గనకనే, మిగిలిన పది మందికీ అది ఉండగలుగుతున్నది.
• బూర్జువా వర్గం ఉత్పత్తి చేసే సరుకుల రాసుల అమ్మకాలకు అప్పటి మార్కెట్లు సరిపోవు. నిత్యం విస్తరించే మార్కెట్లు కావాలి. ఆ అవసరం, ఆ వర్గాన్ని ప్రపంచపు నలు మూలలకూ తరుముతుంది.
• బూర్జువా వర్గం, కుటుంబ వ్యవస్త మీద వున్న మమకారాల మేలిముసుగును లాగి పార వేసి, కుటుంబ సంబంధాలను కేవలం ఆర్ధిక సంబంధాలుగా దిగజార్చింది.
• ఏ యుగంలో అయినా, ప్రజల భావాలు, పాలక వర్గం నేర్పే భావాలే.
• సకల దేశ కార్మికులారా, ఏకం కండి!
- మార్క్సు, ఎంగెల్సు
