-
-
కమ్యూనికేషన్ స్కిల్స్, కెరీర్ ప్లానింగ్, ఆశావహ దృక్పధంతో అద్భుత విజయాలు
Communication Skills Career Planning Aashavaha Drukpadhamto Adbhuta Vijayalu
Author: Dr. T. S. Rao
Publisher: Victory Publishers
Pages: 45Language: Telugu
కమ్యూనికేషన్ స్కిల్స్
కమ్యూనికేషన్‌ను కొన్ని సింబల్స్, సిగ్నల్స్, స్పీచు, బిహేవియర్, సైలెన్సు, లిజనింగ్, ఇంకా మాటలు, చిహ్నాలు, గుర్తుల ద్వారా కూడ చేయవచ్చు. మరో విషయం ఏమంటే కమ్యూనికేషన్లో బాడీలాంగ్వేజ్ కూడ ఓ భాగమే. కళ్ళ కదలికలు, తలను అటు ఇటు తిప్పటం, భంగిమలు, మ్యానరిజమ్ ద్వారా కూడ కమ్యూనికేషన్ జరుగుతుంది. కమ్యూనికేషన్ లేకుండ మానవ సంబంధాలే వుండవు. సమర్ధవంతమైన, చక్కని కమ్యూనికేషన్ వుంటే మానవ సంబంధాలే కాదు వ్యాపారంలో కూడ విజయం వరిస్తుంది.
కెరీర్ ప్లానింగ్
• కెరీర్ ప్లానింగ్ లోపిస్తే సమయం, పని, డబ్బు అన్నీ వృధా అవడమేకాకుండ చిరాకు పెరుగుతుంది. అదే మీకు కెరీర్ప్లానింగ్ వుంటే అది మీకు ఎంతో ప్రయోజనకారిగా వుంటుంది.
• ఎన్నో కెరీర్ ఛాయిస్‌లు మీకు అందుబాటులోవున్నాయని గుర్తిస్తారు.
• సెల్ప్ ఎవేర్నెస్ పెరుగుతుంది.
• మీకు లక్ష్యశుద్ధి పెరుగుతుంది.
• ఇంటర్వ్యూలకు సంసిద్ధులవుతారు.
• వ్యక్తిగత అభివృద్ధి, రకరకాల కెరీర్ల గురించిన అధ్యయనం వలన విషయజ్ఞానం పెరుగుతుంది.
• వివిధ వృత్తులలో పనిచేస్తున్న వారితో అనుబంధాలు పెరుగుతాయి.
ఆశావహ దృక్పధంతో అద్భుత విజయాలు
పాజివ్ యాటిట్యూడ్‌ని ఎలా అభివృద్ధి చేసుకోవాలి అని మీరు అనుకోవచ్చు. దానికి మీరు చేయవలసిందల్లా....
• మిమ్మల్ని మీరు సంతోషంగా వుంచుకోవడానికి అందుకు తగ్గ వారినే ఎంపిక చేసుకోవాలి.
• జీవితంలో వెలుగు కోణాల వైపు తొంగిచూడండి.
• ఎపుడూ నవ్వుతూ వుండడానికి ప్రయత్నించండి. అందుకు తగ్గ పరిస్థితులని అన్వేషించండి.
• మీపై మీకున్న నమ్మకాన్ని సడలిపోనివ్వకండి. ఈ విశ్వంలో మానవ మేధస్సుకు అపారమైన శక్తి వుంది. విశ్వాసానికున్న శక్తిని కూడ నమ్మండి.
• సంతోషంగా, ఆనందంగా వుండేవారితో ఎక్కువ సమయం గడపండి.
• ప్రేరణ కలిగించే కథలను చదవండి.
• ధ్యానం అలవరచుకోండి
