-
-
కామెడీ . కామ్
Comedy Dot Com
Author: Telugu Bloggers
Publisher: Self Published on Kinige
Language: Telugu
కామెడీ . కామ్
తాజా హాస్యరసం... తెలుగు బ్లాగుల నుండి!
ఈ పుస్తకం గురించి
అంతర్జాల విప్లవానికి సైదోడుగా తెలుగు లోనూ బ్లాగులు వెల్లివిరిసాయ్. తెలుగు బ్లాగర్లు తమదైన శైలిలో నవ్వుల పువ్వులు పూయిస్తున్నారు. పేరెన్నికగన్న రచయితల రచనలకి ఏమాత్రం తీసిపోని నవ్వుల విరజాజులు కొన్ని పుస్తక రూపంలో మీకోసం.
కొత్తతరం రచయితల నుండి సరికొత్త రీతిలో హాస్యం!
* * *
అవి నేను అమీర్‌పేటలో హస్టల్ వెతుక్కుంటున్న రోజులు. అక్కడ కనక మనగలిగితే ఆఫ్రికా అడవుల్లో, అఫ్ఘనిస్తాన్ టెర్రరిస్ట్ క్యాంపుల్లో సైతం ఆనందంగా బతికేయుచ్చని పుకారు. నేను బాగా ఆలోచించి, చించీ ఇద్దరు అక్కాచెల్లెళ్ళు ఉంటున్న హాస్టల్ రూములో చేరిపోయాను.
- శ్రీవిద్య
* * *
పొద్దున్నే అయ్యప్ప పూజ చేసుకొని కిటికి తలుపు తెరిచా పక్షులింకా అప్పుడే బ్రష్ చేసుకోవటం మొదలు పెట్టాయి. నేను స్నానం కూడా చేసాను అని వాటికి తెలియాలని బట్టలు శబ్దంవచ్చేలా పదిసార్లు దులిపి తీగమీద వేసి వచ్చా. లేకపోతే సాఫ్ట్ వేర్ వాళ్ళంటే ప్రతి ఒక్కడికి లోకువే. “మా లంచ్ అయితే గాని పక్కమీదనుంచి లేవని సాఫ్ట్వేర్ వాళ్ళు” అని పక్షులు ఒక సామెత కూడా పెట్టేసుకున్నాయి. ఈ రోజుకి వాటి తిక్కకుదిరింది.
పిచ్చుక 1: కిచకిచ కిచ్ కిచ్ కీచ్ కీచ్ (తెలుగులో: ఏంటే మనోడు ఈ రోజు పొద్దున్నే లేచాడు. ఏంటి సంగతి?)
పిచ్చుక 2: కిచో కిచ కిచోకిచ కిచకిచే కిచ కిచకిచే కిచ కిచ్చు కిచ్చు కిచ్చు కిచ్చు (తెలుగులో: నిద్రపట్టక. మాబావ స్వాలో అమెరికా లోని లీమన్ బ్రదర్స్‌లో గూడు కట్టుకొని ఉన్నాడు తెలుసుగా. వాడు నిన్నే మెయిల్ పెట్టాడు. రియల్ ఎస్టేట్ వ్యాపారం చెయ్యమని. అమెరికాలోని ఆర్ధికమాంద్యానికి ఇక్కడ సాఫ్ట్వేర్ కంపెనీలు ఎలాగు మూసుకోవాలి. ఇళ్ళులేని భారతీయ పక్షులన్నింటికీ హైటెక్ సిటీలో గూళ్ళు కట్టి అమ్ముకో అని. అదీ వీడి ఉద్యోగం ఉంటుందో ఊడుతుందో అని నిద్రపట్టక లేచుంటాడు.)
- మురళీధర్ నామాల
* * *
ఓ నెల రోజుల క్రితం మాట...మా వదిన షాపింగు చెయ్యాలంటే తోడు వెళ్ళాను. తన దగ్గరున్న 1,487 జతల చెప్పులు పాతవయ్యాయని కొత్త చెప్పులు కొనటానికి 'మెట్రో షూ మార్టు'కు వెళ్ళాము. మూడు గంటల తరువాత తను కొన్న చెప్పులకు బిల్లు కట్టటానికి పర్సులో ఉన్న డబ్బు, కారు తాళాలు, ఇంటి కాగితాలు షాపు వాడికి ఇస్తుండగా ఎవరో ఒకమ్మాయి వచ్చి మా వదినను పలకరించింది..ఓ ఐదు నిముషాల పాటు మాట్లాడుకున్నారు..దూరంగా కూర్చున్న నన్ను చూపించింది మా వదిన..ఈ చెప్పుల కొట్టోడికి నన్ను తాకట్టు పెట్టేస్తొందేమోనని కంగారు కంగారుగా పరిగెట్టుకెళ్ళాను...
- గౌతం
