-
-
కాలేజ్ గేట్
College Gate
Author: Annadi Jithednar Reddy
Publisher: Self Published on Kinige
Pages: 154Language: Telugu
కాలేజీలోకెళ్ళాక సాయి గురించి నాకు మరి కొన్ని విషయాలు తెలిసాయి. సాయి, చివరి సంవత్సరం ముగిసాక అతనికి ఐదు బ్యాక్‌లాగ్స్ మిగిలాయి. కానీ, ఇంత వరకు అతడు ఫీజు కట్టి ఒక్క ఎగ్జామ్ కూడ రాయలేదు. కాలేజీ వారు అతనికి ఫోన్ చేసి విషయం చెప్పినా ఏమాత్రం ప్రయోజనం లేకపోయింది.
అతడు ఎగ్జామ్స్ రాయకపోవడనికి గల కారణాలు కొందరి ద్వారా తెలిసాయి. కాలేజీ నుండి అందరూ వెళ్ళిపోయిన తర్వాత ఒక్కసారిగా అతడు ఒంటరి వలయంలో చిక్కుకుపోయాడు. కాలేజీ ముగియడన్ని అతడు జీర్ణించుకోలేక పోయాడు. అర్థరాత్రుళ్ళు అకస్మాత్తుగా నిద్ర నుండి లేచి, దీర్ఘంగా ఆలోచిస్తూ కూర్చుండే వాడు.
''మళ్ళీ నాకు కాలేజీ గుర్తుకొస్తే భయం వేస్తుంది'' ఎవరైనా బ్యాగు వేసుకున్న కాలేజీ స్టూడెంట్స్‌ను చూడగానే నా మూడ్ మారిపోతుంది'' అని కొందరి సన్నిహితుల వద్ద వాపోయినట్లు తెలిసింది. ఎవరయినా కాలేజీ పాత స్నేహితులు కనిపిస్తే చాలా ఉద్వేగంగా వాళ్ళను అతుక్కునే వాడట. ఇలా సాయి గురించిన రహస్య విషయాలు తెలిసాక నాకు చాలా ఆశ్చర్యం వేసింది.
నాకతడు ఒక మాట చెప్పాడు ''అందరూ తమ మనస్సులోని భావోద్వేగాలను దాచుకోవడనికి విశ్వ ప్రయత్నం చేస్తారు. కానీ, నేను వాళ్ళకు పూర్తి భిన్నం. ఎందుకంటే నా విషయాలు అందరితో పంచుకోవాలనుకుంటున్నాను'' అని చెప్పాడు.
Ee book chaduvutunte andarilage nenu kuda na Engineering days lo ki vellipoyanu. last lo accident twist, aa tarvata hero emayyadu anedi suspense ga, exciting ga chala bagundi.