-
-
కాఫీ విత్ కామేశ్వరి
Coffee With Kameswari
Author: Kameswari Chengalvala
Publisher: J.V.Publications
Pages: 224Language: Telugu
ఈ టైటిల్ పెట్టి సుమారు మూడునెలలు ధారావాహికంగా నేను రాసిన శుభోదయాల పలకరింపులు మన ముఖపుస్తక మిత్రులందరినీ బాగా అలరించాయి. ఒక నవల రాసిన, ఇరవయి కథలు రాసినా కలగని ఆనందం నాకు ఎప్పటికప్పుడు తమ అభినందనల ద్వారా కలిగించిన అనేక సమూహాల మిత్రులు అందించిన ప్రోత్సాహం మరువలేనిది.
మొదట సరదాగా మొదలుపెట్టాను ఉదయం పూట. చాలా తాజాగా మనమున్న వేళ నాలుగు సరదా మాటలు చెప్పుకుంటే ఆ సంతోషం ఆ రోజంతా మనని ఉత్తేజపరుస్తుంది.
మర్నాడు ఏం కబుర్లుంటాయో! అని ఎదురు చూసేలా చేస్తుంది. ప్రతీరోజు ఇంట్లో కాఫీతో పాటు, ఈ కాఫీ కబుర్లకి అలవాటు పడిపోయామని, ఏ రోజయినా రాయకపోతే మెసెంజర్లో, వాట్సాప్లో వచ్చి నిలదీసే మిత్రులెందరో! అలా లేటయినపుడు "ఛాయ్ విత్ చెంగల్వల"గా "ఖానా విత్ కామేశ్వరి"గా కూడా నా కబుర్లు పంచాను.
నాకు అనుభవంలోకి వచ్చినవి, నేను విన్నవి, తెలుసుకున్నవి, చూసినవి, కలిపి సరదాగా రాసుకున్న ఈ కాఫీ కబుర్లు మరెందరికో చేరాలని, అందులో సున్నితంగా సృజించిన ఎన్నో సామాజిక విషయాల వల్ల కొందరిలో అయినా మార్పు తీసుకొస్తే మంచిదని నమ్ముతూ, ఈ కబుర్లన్నీ నా స్నేహితురాలు, పబ్లిషర్ శ్రీమతి జ్యోతి వలబోజు సహకారంతో ఈ ప్రింట్ బుక్, కినిగె.కామ్ వారి సౌజన్యంతో "ఈ బుక్"గా కూడా మీ అందరికీ అందిస్తున్నాను."
- కామేశ్వరి చెంగల్వల
