• Cinema Poster
 • Ebook Hide Help
  ₹ 120 for 30 days
  ₹ 405
  450
  10% discount
  • fb
  • Share on Google+
  • Pin it!
 • సినిమా పోస్టర్

  Cinema Poster

  Author:

  Publisher: Vijaya Publications

  Pages: 416
  Language: Telugu
  Rating
  5 Star Rating: Recommended
  5 Star Rating: Recommended
  5 Star Rating: Recommended
  5 Star Rating: Recommended
  5 Star Rating: Recommended
  '5/5' From 3 votes.
  5 Star Rating: Recommended
  5 Star Rating: Recommended
  5 Star Rating: Recommended
  5 Star Rating: Recommended
  5 Star Rating: Recommended
  '5/5' From 1 premium votes.
Description

సాంకేతికపరంగా సినీ దిగ్గజాల దృష్టిలో సినీ 'పబ్లిసిటీ డిజైనింగ్‌' అనే ఈ శాఖ చిట్ట చివరిదీ, కట్ట కపటిదీ, విలువ లేనిదే కావచ్చు. కానీ, సినిమా కంటే ముందుగా థియేటర్లకు చేరేది ఈ శాఖ నుంచి వచ్చిన పోస్టరే. ప్రేక్షకునికి సినిమామీద ఒక అవగాహన తెచ్చి థియేటర్‌దాకా తీసుకువచ్చేదీ ఈ పోస్టరే. ఎవరైనా... ఎంచుకున్న శాఖ ఏదైనా అందులో శిఖరాగ్రాన్ని చేరుకోవడం అంటే విజయాన్ని అందిపుచ్చుకోవడమే అవుతుంది. అలాంటి విజయం కోసం చేసిన నా జీవన పోరాటంలో అడుగుగునా ఎదురైన కొన్ని మధుర క్షణాలకు, మరెన్నో చేదు అనుభవాలకు అక్షర రూపమే... ఈ పుస్తకం....

చిత్రకళకు, ప్రచారకళకు, వాటి అనుబంధ విభాగాలకు ఈ పుస్తకం ఒక ప్రతిరూపం కాలగదని ఆశిస్తున్నాను.

- ఈశ్వర్

* * *

'సినిమా పోస్టర్‌'లో ఒక్కొక్క సంగతి, ఒక్కో అంశంగా చూస్తుంటే మనకు అనేక కోణాలను ఆవిష్కరిస్తోందన్న సంగతి అర్థమవుతుంది. వ్యక్తిగా ఈశ్వర్‌ జీవితం, ఆయన ఎదుర్కొన్న ఒడిదుడుకులూ ఈ పుస్తకంలో మొదటి అధ్యాయం అని అనుకుంటే, చిత్రసీమలో ఆయన ప్రస్థానం రెండో అధ్యాయం. తెలుగు సినిమా చరిత్రలో పబ్లిసిటీ తీరుతెన్నుల గురించి ఆయన వివరణ మూడో అధ్యాయం అవుతుంది. చివరలో వున్న అందర్నీ ఆకట్టుకునే విధంగా ఈశ్వర్‌ వేసిన వర్ణ చిత్రాలు నాలుగో అధ్యాయం. అందుకే ఈ పుస్తకం ఈశ్వర్‌ ఆత్మకథంగా ఆరంభం అయి ఆయన వర్ణ(విశ్వ)రూప ప్రదర్శనతో అభిమానులందరూ తమ తమ అభిమాన నటీనటుల వర్ణచిత్రాలను ఫోటోలు కట్టుకుని దాచుకునేంత అద్భుతంగా ముగుస్తుంది. మనకు మన తెలుగు భాషలో చలన చిత్రసీమలోవున్న వివిధ శాఖల గురించి సమగ్ర పరిశీలనలు, పుస్తకాలు లేవు. పరిశ్రమకువచ్చి తమ తమ రంగాల గురించి, తమ జీవితాల గురించి యిలాంటి పుస్తకాలు రాయడం చాలా అవసరం. ఇలాంటి ప్రయత్నాలు ముందు తరాలవారికి మార్గదర్శకాలవుతాయి. పేరున్న దర్శకులు, ఛాయాగ్రహకులు, సంగీత దర్శకులు, రచయితలు, కళాదర్శకులు చెయ్యవలసిన పని ఎంతో వుంది. దానికి ఈ ఈశ్వర్‌ పుస్తకం నాందిపలికింది.

- 'నవ్య' వీక్లీ, 26 అక్టోబర్‌, 2011

గమనిక: "సినిమా పోస్టర్" ఈ-బుక్ సైజు 62 MB

Preview download free pdf of this Telugu book is available at Cinema Poster
Comment(s) ...

తన సుదీర్ఘ వృత్తి జీవితంలో తన కుంచె నుంచి వెలువడిన ఎన్నో చిత్రాలను ఆల్బమ్‌లా గుదిగుచ్చి అందించారు. viharam blog

డ్రాయింగ్ లో రక రకాల పద్ధతులు , రీతుల గురించి,(క్రోక్విల్ పెయింటింగ్, చార్ కోల్ స్కెచ్,వాష్ డ్రాయింగ్,పాచ్ వర్క్ పైంటింగ్స్), అలాగే పాత్రల రూపకల్పన కోసం వేసిన స్కెచ్ లు (ఉదాహరణకు విగ్గుల తయారీ కోసం ఒక కథానాయుకుడిని రక రకాల హెయిర్ స్టైల్స్ లో ఊహిస్తూ చిత్రాలు వేయడం) ఫైనల్ గా నాలుగైదు స్కెచ్ లు వేసి నిర్మాత, దర్శకులతో ఒకటి నిర్థారించడం ఇవన్నీ ఈశ్వర్ చాలా శ్రద్ధగా వివరిస్తారు. మనకూ బాలీవుడ్ కీ, హాలీ వుడ్ కీ పబ్లిసిటీ పద్ధతుల్లో తేడాలు, సినిమా థీమ్ నిబట్టి పోస్టర్ ప్రిపేర్ చేయడం,టెక్నాలజీకి అనుగుణంగా పోస్టర్ల తయారీలో వచ్చిన మార్పులు ఇవన్నీ చదువుతుంటే చాలా ఆసక్తిగా అనిపిస్తుంది.. నవతరంగం రివ్యూ

ఈశ్వర్ జీవితంలో చాలా నాటకీయత ఉంది. ఐశ్వర్యం, దారిద్ర్యం, విఫల ప్రేమ, బంధుమిత్రుల ద్రోహాలు, అవమానాలు, వీటన్నిటినీ అధిగమించి సఫలం కావడం, తనను అవమానించినవారిని సైతం ఆదరించటం యండమూరి, యద్దనపూడిల నవలలా ఉంటుంది ఆయన కథ. - జంపాల చౌదరి. పుస్తకం డాట్ నెట్ పై.