• Chupu
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 60
    60
    0% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • చూపు

    Chupu

    Publisher: Ramyabharathi

    Pages: 96
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description


వాదానెప్పుడు నమ్మకు
అది ఒక వైపునుండే
సరైన దారిని చూపిస్తూ...
నీలోని మానవత్వమున్న మనిషిని,
మనస్సునీ చంపేస్తుంది


వాదమెప్పుడూ
ఆకులు,అలములు పంచి
ఆకలీ అలమటింపులను తీర్చలేదు సరికదా
నిద్రిస్తున్న పులి తోకను
మెలిపెట్టి పంజా విసిరేట్టు చేస్తుంది


వాదమెప్పుడు
దాహార్థిని తీర్చే మంచినీటి చెమ్మను
అందివ్వదు సరికదా
వరదలై పారే ఉప్పు ఉప్పని రక్తాన్నే
తాగిస్తుందది
వాదమెప్పుడు
ప్రకృతి ఒడిలో హాయిగా నిద్రించేలా
జోకొట్టలేదు సరికదా
ప్రళయకాల రుద్రుడిలా
ఘీంకారాల నాట్యం చేయిస్తూ
తీవ్ర భయందోళనలకు గురి చేయిస్తుంది


వాదమెప్పుడూ
గలగలా పారే నదీనాదాల శబ్దాలను
వినసొంపు అనుభూతీ పరవశాలకు
గురి చెయ్యదు సరికదా
భగభగ మండే వేడి నెత్తుర్ని ఉడికించి
నీలోని 'మంచి'ని వంచన చేయిస్తుంది


రాయీ రాయి రాపిడి చేస్తే
నిప్పుని పుట్టించినట్లు
మనిషిని మనిషినీ
ఘర్షణల రాపిడికి గురి చేసి
నీలోని మానవత్వమనే గొప్ప గుణాన్ని
మంట గొలిపే
గొప్ప వరంగా ప్రసాదిస్తుంది.....
ఖాళీ సంచిని అందంగా
భుజానికి తగిలించి
కాలే కడుపునే మిగిలిస్తుంటుందది!

Preview download free pdf of this Telugu book is available at Chupu