-
-
చుక్కాని చిరు దీపం
Chukkani Chiru Deepam
Author: Sripada Swatee
Publisher: Smitha Publications
Pages: 101Language: Telugu
నాలుగురోజుల తరువాత వచ్చాడు హరి. ఎప్పటిలా పరామర్శలు కాఫీలు అయ్యాయి. ఆమె గది బాల్కనీలో కుర్చీలు వేసుకుని కూచున్నారు హరీ, చందన. సన్నగా పాట హమ్ చేస్తున్నాడు హరి.
''పూవై విరిసిన పున్నమి వేళా'
"పాడు హరీ”
"కాదు నేను మంచి బాలుడిని''
“చాల్లే ఇది పాత జోక్, పాట పూర్తిగా పాడు''
పాటలో లీనమై పోయాడు. పాట ముగిసే సరికి అతని కళ్ళల్లో నీళ్ళు.
“మరీ ఇంత సున్నితమైతే ఎలా హరీ?" అని క్షణం ఆగి,
“అన్నయ్యతో ఏదో చెప్పావట? నాతోనే చెప్పవచ్చుగా..."
"చెప్పాడా ? నీతో ప్రత్యేకం చెప్పాలా? నా భావం నీకు ఎప్పుడో అర్ధం అయిందని నాకు తెలుసు. అయినా పెళ్ళిమాటలు పెద్దవాళ్ళతోనేగా మాట్లాడ వలసినది.”
“ఆ వరసలోనే నేనూ ఎప్పుడో నిర్ణయించుకున్నాను హరీ, నా ఇష్టాఇష్టాలు ఏవైనా పెద్దలు అంగీకరించిన వాళ్ళనే నేను ఒప్పుకుంటాను. దానిలో ఎన్ని కష్టనష్టాలు ఎదురైనా..."
"అందుకే నువ్వంటే నాకు గౌరవం చందనా, ఏదేమైనా కానీ నేనూ నిర్ణయించుకున్నాను బ్రతుకో చావో అది నీతోనే. మీ వాళ్ళు ఒప్పుకోకపోతే ఒప్పించడానికి ప్రయత్నిస్తాను ఎన్నాళ్ళైనా, ఎన్నేళ్ళైనా... అలాగని ఇది భౌతిక ప్రేమ కాదు. ఏమిటో చెప్పలేను కాని..."
అవును ఒక సంవత్సరమా రెండు సంవత్సరాలా ఆరేళ్ళపాటు, అక్షరాలా ఆరేళ్ళపాటు...
