-
-
చుక్కల్లో చంద్రుడు
Chukkallo Chandrudu
Author: Manjari
Publisher: Sagar Publications
Pages: 111Language: Telugu
Description
రోల్‌కాల్ అనంతరం మెస్ వెనుకనున్న టెంటులో పార్టీ మొదలయింది. ఆర్మీమెయిన్ క్యాంటీన్ నుంచి తెచ్చిన విస్కీ బాటిల్ తెరిచి పది గ్లాసుల్లో సర్ది వాటర్ కలిపాడో జవాను. తలోగ్లాసు అందుకుని ``ఛీర్స్” చెప్పి తాగడం ప్రారంభించారు.
పిచ్చాపాటి కబుర్లతో కొంత సమయం గడిచిన తరువాత చంద్రయ్య అడిగాడు.
``మన జీవితాలు ఇలా వుండటానికి కారణం ఎవరో మీకు తెలుసా?”
``తెలియదు...” ఒకతను అన్నాడు.
తన సమాధానం అదే అన్నట్టు మిగతావారు తలలు ఆడించారు
``ముక్కోటి దేవతల్లో ఒకతని కారణంగా మనం ఇలా వున్నాం...”
``ఎవరతను?” ఓ సీనియర్ ఆశ్చర్యంగా అడిగాడు.
అందర్నీ కలియజూసి జవాబిచ్చాడు చంద్రయ్య.
``నారదుడు”
పార్టీలోనివారంతా ఆశ్చర్యం ప్రకటించి అతను ఏదో చెప్పబోతున్నాడని గ్రహించి ఆసక్తిగా చెవులు రిక్కించారు.
చంద్రయ్య సిగరెట్ ముట్టించాడు.
Preview download free pdf of this Telugu book is available at Chukkallo Chandrudu
Login to add a comment
Subscribe to latest comments

- ₹108
- ₹140.4
- ₹108
- ₹86.4
- ₹129.6
- ₹108