-
-
చివరకు మిగిలింది?
Chivaraku Migilindi
Author: Dr. M.V. Ramana Reddy
Pages: 515Language: Telugu
సుప్రసిద్ధ ఆంగ్ల నవల "గాన్ విత్ ద విండ్"కు ఇది అనువాదం.
ప్రపంచవ్యాప్తంగా రెండు కోట్ల కాపీలు అమ్ముడుబోయి చరిత్ర సృష్టించిన నవల.
సినిమాగా విడుదలై పది అకేడమీ అవార్డులు సొంతం చేసుకున్న నవల.
ప్రేమ, పెళ్ళి, కుటుంబ జీవితాలతో పాటు అమెరికాలో భూస్వామ్య విధానం జరిపిన చిట్టచివరి పోరాటాన్ని కళ్ళకు కట్టినట్టు చూపించే నవల.
* * *
1861లో మొదలైన అమెరికా సంయుక్తరాష్ట్రాల అంతర్యుద్ధం నేపథ్యంగా ఈ నవల ఒక స్త్రీ జీవితాన్నీ, అంతరంగాన్నీ భూమికగా చిత్రించింది. అమెరికన్ అధ్యక్షుడు అబ్రహం లింకన్ పట్టుదల కారణంగా, అప్పటికే చివరిమెట్టుకు చేరిన బానిస విధానం, భూస్వామ్య విధానం ఎంత అవలీలగా కూలిపోయాయో ఇందులో కళ్ళకు కట్టినట్లు కనిపిస్తుంది. ప్రేమ, యుద్ధం, సంస్కృతి అనే మూడు వేరు వేరు పాయలను జడగా అల్లి, సాహితీ సౌందర్యానికి కానుకగా అర్పించిన శ్రీమతి మార్గరెట్ మిచ్చెల్ ఒకే ఒక నవలతో పాఠకుల మనసులో శాశ్వతంగా నిలిచిపోయింది.
ఇంత గొప్ప నవల, అక్కడక్కడ సమీక్షగా తప్ప, ఈ 70 సంవత్సరాల్లో తెలుగు పాఠకులకు అందలేదు. ఆ కొరత ఇప్పుడు తీరబోతూంది.
- నవ్య వారపత్రిక
19 నవంబర్, 2009
Awesome book A must for literary lovers.
Wonderful, amaging and Out standing novel. A must for literary lovers