-
-
చినుకు
Chinuku
Author: Suryadevara Rammohana Rao
Publisher: Model Publications
Pages: 177Language: Telugu
కాస్సేపు వర్షాన్ని చూసింది. బోరుకొట్టంతో టి.వి. ఆన్‌చేసి చూడసాగింది. ఆమెకు ఆలోచనలు చుట్టు ముట్టాయి. ఏమి! యీమధ్య తనని ఫాలో అయి ఏడిపించే వాళ్లు ఎక్కువయ్యారు.
వాళ్ళని ఏంచేయలేక పోతుంది. వాళ్ళని అలావదిలేయడం వల్ల ఇంకా ఎక్కువగా చేసే అవకాశంకూడా వుంది.
''ఏంచేస్తే బావుంటుంది. పోని అభితో చెబితే....'' అభిమాత్రం ఏం చేయగలడు. నోట్లోవేలుపెడితే కొరకలేడు సరికదా, వేలు ఎందుకు పెట్టారు...? అని ఎదురు ప్రశ్నిస్తాడు... అభిని మార్చాలి ముందు. పిరికి తనాన్ని పోగొట్టాలి.పిరికి వాళ్ళని కూడ అమ్మాయిలు ప్రేమిస్తారు. తనుకూడ అభిమానించ గలుగుతుంది. గతంలోఅయితే అసహ్యించుకొనేది.
చిత్రంగా వుందే...? ఎందుకిలా తను మారిపోతుంది. ఒకళ్ళని మార్చబోయి... అయినా తనెందుకు మిత్రాని మార్చాలని ప్రయత్నిస్తుంది ఎందుకో...? ఎందుకో ఆమెకే తెలియదు సమాధానం. లేచివెళ్లి టి.వి. కట్టేసి కూర్చుంది. ఇంతలో...
బయట అడుగుల చప్పుళ్లు వినిపించాయి. వచ్చింది మిత్రా...? తనలోతానే ప్రశ్నించుకుంది మృదుల. ఆమెకు తెలియకుండనే, మిత్రా గురించి ఆలోచిస్తుంది. అందువల్ల ఏమాత్రం బయట చప్పుడైనావచ్చింది మిత్రాయే అనుకుంటుంది. వచ్చింది మిత్రాయే... పక్కిం నుంచి వచ్చినా వర్షం బాగా కురవడం వల్ల తడిచిపోయాడు. మృదులాకు కోపం, ప్రేమ రెండు ఒకేసారి వచ్చాయి.
Utter waste of time