-
-
చింతలవలస కథలు
Chinthalavalasa Kathalu
Author: Dr. Mula Ravikumar
Publisher: Kamadhenu Foundation
Pages: 160Language: Telugu
కథలు చాలావరకూ ఉత్తరాంధ్ర ప్రాంతపు చింతలవలస అనే కుగ్రామం కేంద్రంగా తిరుగుతాయి. అలాంటి కుగ్రామంలోని అమాయకుల బతుకుల గురించీ, నిజాయితీ గురించి, ఆ అమాయకత్వాన్నీ, నిజాయితినీ వాడుకునే నాయకులూ, ఉద్యోగుల గురించి రచయిత చెప్పిన తీరు, వాస్తవాలని పాఠకుల ముందుంచుతుంది. అక్కడక్కడ ఆర్ద్రత కలిగించేదిగా ఉంటుంది.
* * *
వలస జీవుల చింతలను, చింతలవలస నేపధ్యంగా ఆకట్టుకునేలా వ్రాస్తూ, తెలుగు కథను పాల పుంతలికి తీసుకెళ్ళి, శ్వేతవిప్లవంలోని గతుకుల్ని ఆవిష్కరించిన రచయిత డా. రవికుమార్.
- ఎలెక్ట్రాన్ (పింగళి వెంకట రమణారావు)
* * *
గ్రామీణ ప్రాంతంలో పనిచేసే ప్రతీ ఉద్యోగి తప్పనిసరిగా చదవాల్సిన కథలు. గ్రామీణాభివృద్ధి, వ్యవసాయ డైరీ రంగాల్లో శిక్షణా సంస్థలు, శిక్షణలో భాగంగా కేస్-స్టడీస్గా చర్చించడానికి ఈ కథలు చక్కగా సరిపోతాయి.
- డా. పైడి శ్రీరాములు
* * *
రచయిత డా. మూలా రవికుమార్ స్వస్థలం విజయనగరం జిల్లా, అమరాయవలస గ్రామము. పశువైద్యశాస్త్రంలో స్నాతకోత్తర పట్టా (M.V.Sc) తీసుకుని, కోస్తా, రాయలసీమలోనూ, రాజస్థాన్, గుజరాత్, మహారాష్ట్రలోనూ పనిచేసారు.
Naa peru Uday, Ippude ee pustakam chadavadam poorti ayyindi. Nenu book cover page chuse konnanu, entha adbutam ga vundi. Nenu Tuurpu Godavari Prantam vaadini, pallelante maha istam, ee pustakam loni kadallanni chal chala baavunnay......especially varninche vidhhanam adbutam.....Thanks www.udayarumilli.com
ఆంధ్రభూమి అక్షర పేజీలో "చింతలవలస కథలు" పుస్తకంపై వచ్చిన సమీక్ష
http://teblog.kinige.com/?p=3300
మూలా రవి కుమార్ గారు వ్రాసిన 'చింతల వలస కథలు' అనే పుస్తకం చదివాను. ఉత్తరాంధ్ర ప్రాంతం లోని చింతల వలస గ్రామం లోని అమాయక ప్రజల జీవితాల తో ముడిపడిన కథల సంకలనం ఆద్యంతం రక్తి కట్టిస్తాయి. ఈ కథల్లో దొర్లిన ఉత్తరాంధ్ర మాండలిక పదాలు చదువ ముచ్చటగా ఉన్నాయి. ప్రతి ఒక కథా మంచి అభిప్రాయాన్ని కలుగజేస్తుంది. కాకపోతే అప్పుడే కథ అయిపోయిందే అనిపించేలా ఉన్నాయి ఈ చింతల వలస కథలు. అంత త్వరగా కథ నుంచి బయటకు రావడానికి మనసోప్పుకోదు. నాకు బాగా నచ్చాయి ఈ కథలు. థాంక్స్ రవి కుమార్ గారు.
ఈ పుస్తకంపై కౌముది.నెట్ అక్టోబరు 2012 సంచికలో ప్రచురితమైన సమీక్ష ఇక్కడ చదవండి.