• Chinnamma Chitkalu
    • fb
    • Share on Google+
    • Pin it!
  • చిన్నమ్మ చిట్కాలు

    Chinnamma Chitkalu

    Pages: 190
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

తెలుగులో ''చిట్టకము'' అని ఒక అందమైన పదం ఉంది. దీనికి గుట్టు, భేషజం, మటుమాయం, సూక్ష్మం సూచన, హేతువాదం - ఇలాంటి చాలా అర్థాలున్నాయి. 'చిట్టకం' పదం తెలుగువారి నోట 'చిట్కా'గా మారి ఉంటుందని నా అభిప్రాయం. చిట్కాలు అనేవి సూక్ష్మంలో మోక్షాన్నిచ్చే దగ్గర దారులు. గోటితో పోయేదానికి గొడ్డలి పట్టుకునే పరిస్థితిని రానీయకుండా నివారిస్తాయి. లేతగా ఉన్నప్పుడే వ్యాధిని నిర్మూలించేందుకు సహకరిస్తాయి. చిట్కాలనేవి 'చేతి దీపం'లాంటివి. దాంతోనే మొత్తం వెలుగు నింపేసినట్టుకాదు - అది లేకపోతే చీకటి తొలగదు! కాబట్టి, చిట్కాలను ఉబుసుపోని అంశాలుగానూ, పుక్కిటి పురాణాలగానూ, పాత చింతకాయ పచ్చడిగానూ ఎవరైనా భావిస్తే అది వారికి అల్పాయుష్షు కారకమే అవుతుంది! అలాగని, చిట్కాల మీదే ఆధారపడి అసలు చికిత్సను అశ్రద్ధ చేస్తే అది కూడా అల్పాయుష్షు కారకమే అవుతుంది.

అప్పటి కప్పుడు తక్షణ ఉపశమనం కోసం చిట్కాలు ఉపయోగపతాయి. అక్కడితోనే ఆ వ్యాధి సమసిపోవచ్చు కూడా! జలుబు వస్తోందనిపించినప్పుడు కొంచెం అల్లం రసంలో బెల్లం కలిపి తాగం ఒక చిట్కా. జలుబు ఎంతకీ తగ్గన్నప్పుడు, ఎన్నిమందులు వాడినా ఉపయోగం కనించనప్పుడు కూడా చిట్కాలు ఫలితాలిస్తాయి. మందులు వేసుకుని అల్లం రసం తాగితే అది, ఆ మందుని జలుబు పుట్టిన చోటుకు తీసుకువెళ్ళి అక్కడ పనిచేసేలా చేస్తుంది. దీన్ని ఆయుర్వేద శాస్త్రంలో ''యోగావాహి'' అనే ఒక శక్తిగా చెప్తారు. చిట్కాలు అలా ఉపయోగపతాయి. చిట్కాలు నిరపాయకారంగా ఉంటాయి. ''అనుపానం - పులిపాలు'' అనే పద్ధతిలో కాకుండా, వంటింటి చుట్టూ వుండే వస్తువులకు పరిమితంగా, అందుబాటులో ఉంటాయి. చిట్కాలు వికటించటం ఉండదు. తీసుకోవచ్చో - కూడదో అనే అనుమానానికి ఆస్కారం లేనివిగా వుంటాయి. ఇలాంటి ఔషధ ఉపాయాలనే చిట్కాలంటారు. సామాన్యుడికోసం ప్రకృతి ప్రసాదించిన వరాలు ఈ చిట్కాలు!

శ్రీమతి పేకేటి గీతా శివరాంగారు పాఠకుల మనసెరిగిన రచయిత్రి! పాఠకులకు ఏదికావాలో, ఏది ఎంత మోతాదులో ఇవ్వాలో కూడా నిర్ణయించి చెప్పగల అనుభవం పండిన సీనియర్‌ సాహితీవేత్త! ఆమె గత కొంతకాలంగా అనేక పత్రికలలోనూ, ఆకాశవాణి ద్వారానూ అందించిన ''చిన్నమ్మ చిట్కాలను'' ఇప్పుడు పుస్తక రూపంలో తెస్తున్నారు. అనేక వైద్య గ్రంథాలను ప్రచురించటంలో అనుభవం నిండిన శ్రీషణ్ముఖేశ్వరి పబ్లికేషన్స్‌ వారు ఈ ''చిన్నమ్మ చిట్కాలు'' గ్రంధాన్ని తెలుగు పాఠకులకోసం అందంగా అందిస్తున్నారు.

- డా॥ జి.వి. పూర్ణచందు

Preview download free pdf of this Telugu book is available at Chinnamma Chitkalu