-
-
చైనీస్ కనెక్షన్
Chinees Connection
Author: N S Nagireddy
Pages: 182Language: Telugu
''ప్రొఫెసర్ గైల్స్... ప్రపంచంలో వున్న అతి తక్కువ ఆటమిక్ సైంటిస్ట్లలో ఒకరు... బ్రిటన్లో ఆటమిక టెక్నాలజీలో అత్యంత ప్రతిభ కలిగిన వారిలో మొదటి వ్యక్తి... బ్రిటీష్ ఆటమిక్ డెవలప్మెంట్ అధారిటీ ఛీఫ్ డైరెక్టర్గా గత పది సంవత్సరాలుగా పనిచేస్తున్నాడు అతను. గత నాలుగు రోజుల నుండి ఆయన కనిపించటంలేదు... ఏమయిపోయాడో తెలియదు. హి సింప్లీ వానిష్డ్ యిన్ థిక్ ఎయిర్....''
బ్రిటీష్ సీక్రెట్ యింటెలిజెన్స్ సర్వీసెస్ డెప్యూటీ డైరెక్టర్ కాన్ఫిడెన్షియల్ రూమ్లో, ఎయిర్ కండీషనర్ శబ్ధం తప్ప మరే చప్పుడూ వినబడటంలేదు.
విశాలమయిన స్టీల్ టేబుల్ వెనుక స్వింగ్ ఛెయిర్లో కూర్చుని వున్నాడు డెప్యూటీ డైరెక్టర్. ఆయన ముందు కూర్చుని గోల్డ్ టిప్డ్ సిగరెట్ పొగ రింగులు రింగులుగా వదులుతూ ఆయన చెపుతున్న విషయం శ్రద్ధగా వింటున్నాడు వరల్డ్ కిల్లింగ్ ఆర్గనైజేషన్ రాయల్ ఏజెంట్ నంబర్ ఒన్ కిల్లర్!
''యస్.ఐ.యస్. ఫీల్డ్ ఏజెంట్లు, స్కాట్ లాండ్ యార్డ్ డిటెక్టివ్లు ఈ నాలుగు రోజుల నుండి గైల్స్ ఆచూకీ తెలుసుకోవానికి అన్ని రకాలుగా ప్రయత్నాలు చేశారు. బట్... వారి ప్రయత్నాలు ఫలించలేదు. గైల్స్ ఏమయిపోయాడో తెలియజేసే చిన్న ఆధారం కూడ దొరకలేదు.'' పెదవులు నాలుకతో తడి చేసుకొని కంటిన్యూ చేశాడు డెప్యూటీ.
కిల్లర్ తల పంకించాడు.
