-
-
చైనాలో ఏం జరుగుతోంది?
Chinalo Em Jarugutondi
Author: Ranganayakamma
Publisher: Sweet Home Publications
Pages: 400Language: Telugu
'శ్రమదోపిడిని తీసివెయ్యడం' కోసం, కమ్యూనిస్టు సమాజాన్ని నిర్మించే ప్రయత్నాలు మొదట రష్యాలోనూ (1917 లో), తర్వాత చైనాలోనూ (1949 లో), ప్రారంభమయ్యాయి. కాబట్టి, ఇతర దేశాల కమ్యూనిస్టులూ, కమ్యూనిస్టు పార్టీలూ, రష్యా చైనాల పరిణామాల్ని అధ్యయనం చేసి, వాటినించీ అనుభవాలు తీసుకోవాలి. దీనికోసం చార్లెస్ బెతల్హామ్ రాసిన పుస్తకాలు ఎంతో విలువైన సమాచారం ఇవ్వగలుగుతాయి.
బెతల్హామ్ - ఫ్రెంచి దేశస్తుడు. మార్క్సిస్టు. ఈయన రష్యా చైనాలకు అనేకసార్లు వెళ్ళి, ప్రతీసారీ అక్కడ కొంతకాలంపాటు వుండి, అక్కడ జరుగుతోన్న 'సోషలిస్టు' మార్పుల గురించి వీలైనంత సమాచారం సేకరించి, వాటి తప్పొప్పుల్ని విశ్లేషిస్తూ అనేక వ్యాసాలు రాశారు. రష్యా పరిణామాల గురించి ''సోవియట్ యూనియన్లో వర్గపోరాటాలు'' అనే పేరుతో 4 సంపుటాలూ; చైనా పరిణామాల గురించి ''చైనాలో సాంస్కృతిక విప్లవమూ, పరిశ్రమల నిర్వహణా'' (1973 లో); ''మావో తర్వాత చైనా'' (1978లో) - అనే పుస్తకాలూ రాశారు. చైనా గురించి రాసిన ''మావో తర్వాత చైనా'' (చైనా సిన్స్ మావో) పుస్తకమే ఈ తెలుగు పుస్తకానికి మూలం.
ఈ పుస్తకం - 1976లో మావో మరణం తర్వాత, వెంటనే పార్టీలో పెట్టుబడిదారీ మార్పులు చకచకా ప్రారంభం కావడమూ, మావో పంథా నాయకులు జైళ్ళపాలవడమూ - వంటి సంఘటనల్ని వివరిస్తూ, పార్టీలో పరిణామాలగురించి చర్చిస్తుంది. కానీ మావో తర్వాత 1976 నించీ జరిగిన విషయాలు అర్థం చేసుకోవాలంటే, అంతకుముందు కాలంలో జరిగిన విషయాలు కూడా కొంచెం తెలిసి వుండాలి. 1949 లో రాజ్యాధికారాన్ని తీసుకున్న కమ్యూనిస్టు పార్టీలో ఆనాటినించీ 1976 దాకా ఏం జరిగింది? ఆ కాలమంతా పార్టీ ఎలాంటి ఉద్యమాలు నిర్వహించింది? - ఈ సమాచారం అంతా ఈ తెలుగు అనువాదంలో సమగ్రంగా లభిస్తుంది.
