-
-
చైనా పాఠం
China Patham
Author: Chukka Ramaiah
Publisher: Ramaiah Vidyapeetham
Pages: 92Language: Telugu
రామయ్యగారు చైనా పర్యటనను ఒక విహారయాత్రలా కాకుండా అక్కడి పరిస్థితులను సామాజిక రాజకీయ కోణంలో చాలా ఆసక్తితో పరిశీలించారు. తాను చూసిన అనేక విషయాలను తన రాజకీయ అనుభవంతో విశ్లేషించారు. తన ఈ వ్యాసాల ద్వారా మనకు ఎంతో విలువైన సమాచారం అందించారు.
చైనాలో ఊహకందని విధంగా పారిశ్రామిక సాంకేతిక రంగాలలో సాధిస్తున్న విజయాలను, దాని కొరకు వారు అనుసరించిన పద్ధతులను, కృషిని గమనించారు. ముఖ్యంగా విద్యారంగంలో రకరకాల సంస్కరణలతో అనేక రకాల ప్రయోగాలతో వారి దేశ అవసరాల ప్రాధాన్యతతో కూడిన విద్యా విధానాన్ని అభివృద్ధి చేస్తున్న తీరును విపులంగా అధ్యయనం చేశారు. విద్యను సామాన్య మానవులందరికీ అందుబాటులోకి తేవటమేకాకుండ ఉన్నత విద్యారంగంలో అభివృద్ధి చెందిన దేశాలకు దీటుగా విజయాలను సాధిస్తున్నారనీ, విజ్ఞానదాయక మానవ వనరులను ఇతోదికంగా అభివృద్ధి చేస్తున్నారనీ చెప్పారు.
- యం.మోహన్‌రెడ్డి
