-
-
చైనా కవిత్వం
China Kavitvam
Author: Deevi Subbarao
Publisher: Bodhi Foundation
Pages: 123Language: Telugu
చైనీయులు తమ సంస్కృతిలో కవిత్వానికి అత్యున్నతస్థానం ఇచ్చినట్లుగా చెబుతారు. క్రీస్తుపూర్వం ఐదారు శతాబ్దాల నాటికే పాటల పుస్తకం ఒకటి- వాళ్ళభాషలో షీచింగ్-ప్రచురింపబడి వుంది. ప్రజలనోళ్ళలో నానుతున్న సుమారు మూడు వేల పాటలను, పద్యాలను సేకరించి వాటిల్లోంచి మూడు వందలు ఏరి పుస్తకంగా ప్రచురించటం జరిగింది. ఆ మహత్కార్యాన్ని నెరవేర్చింది కన్ఫూషియస్ అనే గొప్ప తత్వవేత్త.
కొందరు అమెరికన్ కవులు చైనీస్ కవిత్వాన్ని ఇంగ్లీషులోకి అనువదించారు. ఎజ్రాపౌండ్, విలియమ్ కార్లోస్ విలియమ్స్, ఇద్దరు కూడా చైనా కవిత్వం వల్ల ఎంతలా ప్రభావితులయ్యారంటే, వారు తమ కవిత్వ రచనా విధానాన్నే, చైనా కవిత్వ సంప్రదాయానుగుణంగా మార్చుకోవటం జరిగింది. టోనీ బార్న్స్టోన్ అనే కవి చెబుతాడు, “నేను అమెరికానుండి చైనాకు ఎందుకు వెళ్ళాను అంటే, చైనా కవిత్వం అధ్యయనం చేసి, ఇంగ్లీషులో ఎలా కవిత్వం రాయాలో తెలుసుకోవటానికి."
- దీవి సుబ్బారావు
