-
-
చిచ్చర పిడుగు
Chichchara Pidugu
Author: Madhubabu
Publisher: Madhubabu Publications
Pages: 97Language: Telugu
అంతఃపురంలో వున్నాడు మహారాజు, మహామంత్రి, సైన్యాధిపతులతో మంతనాలు కొనసాగిస్తున్నాడు.
రాజభటుల మధ్య తీసుకురాబడిన స్నేహితులిద్దర్నీ చూస్తూ, యువరాజు చేసిన అభియోగాన్ని జాగ్రత్తగా విన్నాడు.
"మహారాజా! పరాయి దేశంనుంచి వచ్చారు వీరు. మనదేశ వ్యవహారాలు, మనవారి మనస్తత్వాలు యింకా బాగా తెలిసి వుండవు." అందించాడు మహామంత్రి.
"ఏ దేశమైతే ఏం మహామంత్రీ! యువరాజు మీద కత్తి ఎత్తటం రాజ ద్రోహంగాదా?" ప్రశ్నించాడు మహారాజు.
"యువరాజు అయితే మాత్రం ఏమిటి మహారాజా? నేరాన్ని సరిగ్గా విచారించకుండా ఆవేశపడితే, చూస్తూ వూరుకోమంటారా?" అడిగాడు ముఖేష్.మహారాజు కనులు అగ్నివర్ణాన్ని పులుముకున్నాయి.
"వీరిని చెరసాలలో బంధించండి ... రేపు రాజ్యసభలో వీరిని విచారించి శిక్షను అమలుపరుస్తాం." అన్నాడు.
మరో పావుగడియ తరువాత అంధకార బంధారమైన చెరసాలలో, చువ్వల వెనుక నిలబడి ఒకరినొకరు చూసుకున్నారు షాడో ముఖేష్ లు.
"రాజూ!" అన్నాడు ముఖేష్.
ఏమిటన్నట్లు కనుబొమ్మలు ఎగురవేశాడు షాడో.
"విక్రమాదిత్యుడి కాలం అంటే స్వర్ణయుగం అంటారుగాని ... వీళ్ళకంటే మనమే అదృష్టవంతులం. వాక్ స్వాతంత్రియం లేని రాజ్యంలో వుండటంకంటె, అడవుల్లో జీవించటం చాలా మంచిది.
అంగీకార సూచకంగా తల వూపి గోడకు ఆనించి వున్న నులక మంచంమీద కూర్చున్నాడు షాడో. అతని కనులముందు రాజనర్తకి నళినీదేవి నటనమాడుతున్నది. ఆ నాట్యానికి ఆమె మెడలో వున్న పచ్చల పతకం ఒకటి ఎగిరెగిరి పడుతున్నది.
ఆ పచ్చల పతకంమీద ముద్రించివున్న చిన్నబొమ్మ, వారు వెతుకుతున్న వుత్సవ విగ్రహం మాదిరిగానే వుంది.
