• Chettuneeda
 • Ebook Hide Help
  ₹ 30 for 30 days
  ₹ 60
  66
  9.09% discount
  • fb
  • Share on Google+
  • Pin it!
 • చెట్టునీడ

  Chettuneeda

  Pages: 66
  Language: Telugu
  Rating
  0 Star Rating: Recommended
  0 Star Rating: Recommended
  0 Star Rating: Recommended
  0 Star Rating: Recommended
  0 Star Rating: Recommended
  Be the first to vote
  0 Star Rating: Recommended
  0 Star Rating: Recommended
  0 Star Rating: Recommended
  0 Star Rating: Recommended
  0 Star Rating: Recommended
  '0/5' From 0 premium votes.
Description

"చెట్టునీడ" కవిత్వంలో సబ్బని భావవీచికలు

సబ్బని లక్ష్మీనారాయణ కవితా సంపుటి "చెట్టునీడ" కవిత్వంలోవారి భావవీచికలు సామాన్య పాఠకున్ని సయితం పులకింప జేస్తాయి. ఇందులో యాభయి కవితలున్నాయి. కవిత్వాన్ని నిర్మలంగా ప్రేమించే వారికి ఈ భావచిత్రాల విలువలు తెలుస్తాయి. పర్యావరణం మీద ఉన్న ప్రేమతో వారి కవిత్వం జాలువారి 'చెట్టునీడ 'గా నామకరణం అయింది. ఇందులో ప్రతి అక్షరంలో జీవం ఉట్టి పడుతుంది. కవిత్వం మీద, వ్యవస్త మీద, నిజాయితీ విలువలమీద, డబ్బు దాహం మీద, అశ్లీలం మీద, బడి మీద, వోట్ల సరలి మీద, తెలంగాణ మీద, ప్రేమ మీద చక్కటి కవిత్వం పొంగి పొర్లింది. వ్యవస్తలోని అవలక్షణాలన్ని తేట తెల్లం చేస్తాడు సబ్బని తన కవిత్వం ద్వారా. గత మూడు దశబ్ధాల లేఖిని అనుభవాన్ని రంగరించి ఈకవిత్వాన్ని మనకు అందించాడు. పొల్లుకు ఎక్కడ తావుండదు.

నీడనిచ్చే చెట్టునే మరచి పోతుంటారని చెట్టునీడ కవిత్వంలొ వాపోతాడు. దీని క్రింద కూర్చున్న మహానుభావులు తపస్సు చేసి జ్ఞ్యాన భోద చేసారన్న సత్యాన్ని రెండవ కవితలొ చెబుతాడు. బలవంతుడికి గులామ్ అయి బలహీనుడి మీద సవాల్ చేసే గుంట నక్కల వ్యవస్థ ఇదియని అంటాడు, వ్యవస్త కవిత్వంలొ. స్తీ ఆడే బొమ్మ, ఆడించే బొమ్మ బుల్లి తెరలు, నిండు తెరల సాక్షిగా..అవ్వతోడులొ చెబుతాడు. అలలాగా ఎగిసి పడుతున్న సముద్రాన్ని కాదని, మురికి నీటి పాయను కూడా కీర్తించె అల్పత్వాన్ని ప్రశ్నిస్తాడు. కవిత్వం నిండుకుండ లాగా తొణకదని మార్పింగ్ వ్యవస్థ మీద ఆవేదన వెల్లగక్కుతాడు. నేడు బడి ఇరుకు గదుల అద్దె ఇల్లని, నేటి కార్పొరేటు మాయజాలాన్ని తేటతెల్లం చేస్తాడు. సెజ్ ప్రకరణాలు రైతును ఎలా బాధిస్తున్నాయో అవ్వబువ్వ కావాలిలో చెబుతాడు. గ్లోబల్ తిరకాసును పూసగుచ్చినట్లు చెపుతాడు. రాజకీయం రంకు నేర్చిందని పోలుసీన్ లో వివరిస్తూ, సామాన్యుడికి మేలు చేసె ప్రజాస్వామ్యం రావాలని అంటాడు. ధనార్జన గూర్చి వివరిస్తూ, సామాన్యుడి బతుకు చిత్రానికి విలువ గడతాడు. ఇక్కడ డబ్బులు అమ్మబడునుద్వారా. పోలవరం ఆనకట్ట వెన్నుపోటును పోలవరం గోదారి మీద కవిత్వంలొ రాస్తాడు. సముద్రం మీద భావ కవిత్వంతో కవి సంగమించిన తీరు అద్భుతం.

సబ్బని కవిత: "చెట్టునీడ"
చెట్టు నీడను ఏమి ఆశించి ఇవ్వదు
ఎవరు వచ్చి తన దాపున చేరినా
తల్లి కోడి పిల్లల్ని తన రెక్కల కింద దాచుకొన్నట్లు
తన నీడన దాచుకొంటుంది
చెట్టుకు స్వపర భేదాలుండవు
బతుకులో అలసిపోయిన వారేవరైనా వచ్చి
చెట్టు నీడన విశ్రమించవచ్చు
చెట్టు నీడనే కొందరికి ఇల్లవుతుంది
చెట్టు నీడ చెంతనే తొలిమానవుడు తల దాచుకొన్నాడు
చెట్టు కొమ్మల ఆసరా చేసుకొనే
బతుకులో ఊహాల ఉయ్యాలలూగాడు
బతుక్కి ఆధారం చెట్టే అయినప్పుడు దాన్ని ఆశ్రయిస్తారు
చెట్టు నీడన అలసిసొలసి సేద దీర్చుకొంటారు
కాని బతుకులో ఎదిగి పోయారనుకొంటారేమో కొందరు
స్థిర నివాసం వచ్చింది అనుకొంటారేమో
చెట్టును, చెట్టునీడను కాల గమనములో కావాలని మరుస్తారు
చెట్టు ఎప్పుడూ ఇచ్చేదే కాని తీసుకొనేది కాదు
మాటలు రాణి మౌనమయిన చెట్టు
చింతలు లేక చిగుర్చే చెట్టు
మౌనిలా చూస్తుంది అన్నీ
కొన్ని నీడనిచ్చేచెట్టు లాంటి బతుకులుంటాయి
తన నీడన ఆశ్రయం పొంది ఎదిగి
తనను కానకుండాపోయే మనుష్యులను చూస్తూ
జాలి పడడం తప్పా చేసేదేముంటుంది
సర్వ ప్రపంచపు విలువలు డబ్బు చుట్టే తిరుగుతున్నపుడు
కొందరు మానవత్వపు పరమ విలువల్ని మరచిపోతారేమో
అయినా చెట్టుకు పోయేదేముంది
నీడనివ్వడం తన ధర్మం
అలా ఎందరికో నీడనిస్తుంది చెట్టు
కాని మనిషి మాత్రం తన ధర్మాన్ని మరచి
నీడనిచ్చిన చెట్టునే మరచిపోతున్నాడు
కృతజ్ఞత లేకుండా.

Preview download free pdf of this Telugu book is available at Chettuneeda