• Chelimelu
  • Ebook Hide Help
    ₹ 135
    150
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • చెలిమెలు

    Chelimelu

    Author:

    Pages: 111
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

ఒఖ్ఖరోజు



రెక్కలల్లార్చుకుంటు ఈ రాత్రి
చీకటిని కొంచెం చలితో కలిపి కప్పుకుంది
మొగులు మీద ఆరేసిన వెన్నెలకండువా
చంద్రుడిప్పుడు ఆకాశపుగంపనెత్తుకున్న సుట్టబట్ట
రెప్పలమీద నుంచి కండ్లల్లకు దిగబోతున్న వెలుగు
నిద్రతంతెల మీద నడుస్తున్నది
తెల్లారెటలికి తెల్లారిపోదా, రాత్రుంటదా నీ ముచ్చటగని


వెన్నెలొలికిన కొండల్ని, గుట్టల్ని, చెట్లని, నీళ్ళని, మట్టిని పిండి
మనుషులెత్తుకుంటుంటరు ఒక రాత్రికోసం చలువచేసిన మనసుల్ని
తీసి, మూసి, తీసి, మూసిన తలుపులు తెరుచుకుని
ఎదురుచూస్తున్న తానే వొచ్చాడు
కంటిదీపాలతో వెలిగిపోయింది గది, మది
ఒంటి గుడిసె పూలపొదయింది.


రాలిపోయిన కన్నీళ్ళను వాడు ముత్యాలదండ చేసుకొచ్చాడు
కాలిపోయిన ఆశల్ని వూదేసి మల్లెపూలుగా మార్చుకొచ్చాడు
ఒక్క ఘడియైతేయేంది ఇంత ప్రేమ దొరికినపుడు
మరొక కాలం లేకున్నా సరే, ఈ పొద్దిట్లా మిగిలిపోతే చాలు
వాడు మురిపాల వానైండు, నేను పూల పడవ


తాను దు:ఖాలను వేటాడుతుంటాడు
నేను వాణ్ణి సాగనంపి, ఎదురుచూస్తుంటాను

Preview download free pdf of this Telugu book is available at Chelimelu