-
-
చారిత్రక వ్యాసమంజరి
Charitrika Vyasamanjari
Author: Mallampalli Somasekhara Sarma
Publisher: Self Published on Kinige
Language: Telugu
మూర్తీభవించిన ఆంధ్రతేజం శ్రీ మల్లంపల్లి సోమశేఖర శర్మ గారు. ఆంధ్ర చారిత్రక పరిశోధకులలో, తొలితరం వారిలో అగ్రగణ్యులు,పూజనీయులు.
" చరిత్ర అంటే మనుష్యుడు చేసిన కృషి, అనుభవజ్ఞానం" అన్న మహా మనీషి. ఆయన చూపిన తోవ, తర్వాత ఎందరో నవ చరిత్రకారులకి అప్పటికీ-ఇప్పటికీ, ఎప్పటికీ మార్గదర్శకం.
శాసన ఆధారాలను, సాహిత్య ఆధారాలను ఎంతో క్షుణ్ణంగా పరిశీలించి, పరిశోధించిన తరువాత చరిత్ర నిర్మాణం చేశారు. నాటి కవులు, సాహితీవేత్తలు, చరిత్రకారులు, లిపిశాస్త్రజ్ఞులు, పరిశోధకులు అందరికీ మద్రాసులో సోమశేఖరశర్మ గారి యిల్లు విడిది కేంద్రం. వివాదాలకు అతీతమైన వ్యక్తిత్వం శర్మగారి సొంతం.
శర్మగారు రాసిన చరిత్ర వ్యాసాలలో కొన్నింటిని మోదుగుల రవికృష్ణ గారి సంపాదకత్వంలో, మిత్రమండలి ప్రచురణలు వారు ప్రచురించారు. ఇందులోని వ్యాసాలు ఎక్కువగా నాటి సామాజిక జీవనానికి ప్రతీకలు. పాదసూచికలు, ఛాయాచిత్రాలు సంపాదకుని కృషికి ప్రతీకలు. ప్రాచీనాంధ్ర దేశంలో శరన్నవరాత్రుల గురించి, అమరావతీ స్తూపము గురించి, నాగార్జునకొండ గురించి ఇంకా మరెన్నో విలువైన వ్యాసాలు ఇందులో పొందుపరచబడినవి. చరిత్రాభిమానులు తప్పనిసరిగా చదవవలసిన పుస్తకం.
చరిత్రంటే కేవలం రాజులు, రాజ్యాలు, రాజుల రాస క్రీడలు ఇంతేనా అని మనం పెదవి విరువటం చాలా సాధారణమైన విషయం. కానీ “చరిత్ర నిర్మాతలు ప్రజలు, రాజులో వారి తాబేదారులో కాదు” అని నినదించిన శ్రీశ్రీ మాటలు అక్షరాలా నిజమనిపిస్తాయి మనం మన చరిత్రను తరచి చూసుకుంటూంటే. అలాని మనం మన చరిత్రను ఎంత వరకూ తొంగి చూడగలం? మనకు మన ముత్తాతగారి చరిత్రే పూర్తిగా తెలియదు. అలాంటిది సమస్త మానవాళిపై అంతో ఇంతో ప్రభావం చూపిన ఒక బలమైన జాతి చరిత్ర మొత్తం తెలుసుకోవాలంటే అసలు మనకు సాధ్యమయ్యే విషయమేనా?
మరింత కింద లంకెలో
http://krishnaveniteeram.blogspot.com/2011/12/blog-post_17.html