-
-
చారిత్రక తెలంగాణ (గేయ కవిత)
Charitraka Telangana
Author: Sabbani Laxminarayana
Publisher: Self Published on Kinige
Pages: 18Language: Telugu
సబ్బని లక్ష్మీనారాయణ కలం నుండి వెలువడిన దీర్ఘ కవిత “చారిత్రక తెలంగాణ”.
తెలంగాణ చారిత్రక, సాంస్కృతిక, సాహిత్య కళా సంస్కృతుల నేపథ్యంగా సబ్బని కలం నుండి స్పాంటేనియస్గా జాలువారిన గేయ కవిత ఇది.
ఈ పుస్తకానికి ముందు మాట రాస్తూ కాకతీయ విశ్వవిద్యాలయం తెలుగు ఆచార్యులు బన్న అయిలయ్య గారు “ప్రవాహం లాంటి తెలంగాణ చారిత్రక వైభవాన్ని పాత్రలోకి వొంపే ప్రయత్నం చేశారు. దీన్ని చదివిన తెలంగాణేతరులకు, తెలంగాణ వాసులకు తెలంగాణాలో పుట్టిన వాళ్ళు ఎందుకు గర్వించాలో అర్థమవుతుంది. ఇందుకు సబ్బని లక్ష్మీనారాయణ గారికి అభినందనలు“ అని అభిప్రాయం వెలిబుచ్చారు.
ఈ గేయ కవితను గమనిస్తుంటే తెలంగాణ జానపద బాణీలు జ్ఞాపకం వస్తుంటాయి. పన్నెండు విభాగాలుగా పన్నెండు పేజీలలో ఒక్కొక్క ఇతివృత్తాన్ని మన కళ్ళ ముందు ఉంచుతాడు సబ్బని. తెలంగాణ జీవనం గూర్చి, కళల కాణాచి అయిన తెలంగాణ వైభవాన్ని గుర్తుకు తెస్తాడు.
నేటి తెలంగాణ ఏర్పాటు చారిత్రక సందర్భంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు ఆవశ్యకతను కూడా నొక్కి వక్కాణిస్తాడు ఈ గేయ కవిత ద్వారా సబ్బని .

- ₹14.4
- ₹72
- ₹60
- ₹60
- ₹60
- ₹36