-
-
కారెక్టర్ ఆర్టిస్టులు
Character Artists
Author: S. V. Rama Rao
Publisher: Kinnera Publications
Pages: 136Language: Telugu
ప్రేక్షకుణ్ణి సినిమాహాలు వరకు రప్పించడానికి హీరో హీరోయిన్ల లేదా డైరక్టర్ యిమేజి పనికి వస్తుంది. కాని లోపలికి వచ్చాక అతన్ని కడదాకా కూర్చోబెట్టగలిగేది కారెక్టర్ ఆర్టిస్టులే... కథ నడిపించేది, పట్టున్న సన్నివేశాలను రక్తి కట్టించేది, హీరో పాత్ర ఎలివేటయ్యేందుకు అతనితో పోటీ పడి నటించేది కారెక్టర్ ఆర్టిస్టులే... హీరోలా యిమేజి చట్రంలో యిరుక్కుపోకుండా, నటనపై మాత్రమే దృష్టి కేంద్రీకరించి, నవరసాలు పోషించగలిగేది కారెక్టర్ ఆర్టిస్టులే...
వీరికి పాటలుండవు, నృత్యాలుండవు, డ్రీమ్ సీక్వెన్సులుండవు, వెరైటీ కాస్ట్యూమ్సుండవు, విదేశాలలో షూటింగులుండవు, వాల్ పోస్టర్లలో ఫోటోలుండవు, సింగిల్ కార్డులుండవు, అయినా తమ అభినయంతో సినిమాకు దన్నుగా నిలబడతారు. నిత్యజీవితంలోని పాత్రలకు దగ్గరగా వుంటూనే విభిన్నత అద్దుతారు.
అందుకే నాయికా నాయకులు తోకచుక్కల్లా ఓ వెలుగు వెలిగి రాలిపోతారు. కారెక్టర్ ఆర్టిస్టులు దశాబ్దాల పాటు నిలిచివుండి ప్రకాశిస్తూనే వుంటారు. తెలుగునాట సమర్థులైన కారెక్టర్ ఆర్టిస్టులకు ఎప్పుడూ కొదవ లేదు. ఐనా వారి జీవితాలు గ్రంథస్తం అయిన సందర్భాలు గుప్పెడే. అలనాటి సియస్సార్, కన్నాంబల నుండి, ఈనాటి ప్రకాష్ రాజ్, తెలంగాణ శకుంతల వరకు...
తెలుగు తెరకు పరిపుష్టి కూర్చిన 100+ కారెక్టర్ ఆర్టిస్టుల జీవనరేఖలు, నటజీవిత విశేషాలు, అరుదైన ఛాయాచిత్రాలు మీ చేతిలో వున్న యీ ఒక్క పుస్తకంలోనే...
