-
-
ఛానెల్ 18
Channel 18
Author: A.N.Jagannadha Sharma
Publisher: Chinuku Publications
Language: Telugu
"హైదరాబాద్ ఎప్పుడొస్తున్నావ్?" అడిగింది.
"మీరెప్పుడంటే అప్పుడే" అంది లక్ష్మి.
"అయితే రేపెళ్లిపోదాం! మీ అన్నయ్యతో చెప్పి బయల్దేరు" అంది శకుంతల.
"అమ్మో! అన్నయ్యతోనా!!వద్దొద్దు! నేనేమీ అన్నయ్యకు చెప్పను! మనం వెళ్లిపోదాం! అంతే!" అంది లక్ష్మి.
"పాపం మీ అన్నయ్య కంగారు పడతాడేమో"
"పడితే పడనీయండి! నా బతుక్కి ఆయన అడ్డుపడకుండా వుంటే అంతే చాలు" అంది లక్ష్మి కోపంగా.
"సరే మరి! రేపు రాత్రి రెండుగంటలకి భాగ్యనగర్ ఎక్స్ప్రెస్సుంది. దానికెళ్లిపోదాం! నువ్వు రెడీ అయిపో" అంది శకుంతల. అలాగేనంది లక్ష్మి.
"మీ అన్నయ్యకు తెలీకుండా ఉండాలంటే అంతా గప్చీప్గా జరగాలి. రేపు రాత్రి పన్నెండున్నర, ఒంటిగంటకల్లా నువ్వు రథం వీధి దాటి సైడ్లో ఉన్న పాడుబడ్డ ఇంటి దగ్గరకొచ్చావనుకో! అక్కడ నీకోసం వెయిట్చేస్తూ త్రిబుల్ గాడుంటాడు. వాడి లూనా నువ్వు ఎక్కావనుకో! నువ్వు హైదరాబాద్ వచ్చేసినట్లే: అని నవ్వింది శకుంతల.
