-
-
చంద్రుడు ఉండడు! తారలూ ఉండవు! కానీ, నేను ఎప్పుడూ నీ దాన్నిగా ఉంటాను!
Chandrudu Undadu Taralu Undavu Kani Nenu Eppudu Nee Danniga Untanu
Author: Ranganayakamma
Publisher: Sweet Home Publications
Pages: 216Language: Telugu
ఒక నవలికా, ఒక కధా, 10 వ్యాసాలూ, కలిసివున్న సంపుటం ఇది.
కధల్నీ, వ్యాసాల్నీ, ఒకే పుస్తకంలో ఇవ్వడానికి 2 కారణాలు ఉన్నాయి. మొదటి కారణం ఏమిటంటే, పాఠకుల్లో వేరు వేరు అలవాట్ల వాళ్ళు ఉంటారు. కొందరైతే, కధలే చదువుతారు గానీ, వ్యాసాల వేపు చూడరు. రెండో రకం వాళ్ళు, మొదటి రకం వాళ్ళనించి పూర్తిగా వేరు. వీళ్ళు వ్యాసాలే చదువుతారుగానీ, కధల వేపు చూడరు. పాఠకుల్లో ఈ తేడాల గురించి, నేను ' జానకి విముక్తి' నవలలో రాశాను. ఒకే పుస్తకంలో కధలూ, వ్యాసాలూ కూడా వుంటే, కధల కోసమే ఆ పుస్తకాన్ని తీసుకున్నా, అందులో వున్న వ్యాసాల పేర్లయినా చదవరా? ఒక్క వ్యాసం మీదైనా దృష్టి పెట్టరా? అలాగే, వ్యాసాల కోసమే ఆ పుస్తకాన్ని తీసుకున్నా, ఈ పాఠకులు కధల వేపు చూడరా? కొత్త ఆలోచనలు, కధల వల్లా, వ్యాసాల వల్లా కూడా కలుగుతాయి. అంత వరకూ ఈ అలవాటు లేని వాళ్ళ కోసం అయినా, అవి రెండూ కలిసి వున్న పుస్తకం వుండాలి.
- రంగనాయకమ్మ
