-
-
చంద్రిక కథ
Chandrika Katha
Author: Subramania Bharati
Publisher: Kavya Publishing House
Pages: 110Language: Telugu
తమిళులు నెత్తిమీద పెట్టుకుని ఆరాధించే మహాకవి సుబ్రహ్మణ్య భారతి 'చంద్రికైయిన్ కతై' అని అరవంలో ఒక అసంపూర్ణ సాంఫిుక నవల రాశారు. గోపాల - కృష్ణ - రాఘవన్ అనే రచయితల త్రయం ఈ నవలని తెలుగు చేశారు. ఇందులో 'గోపాల' బండిగోపాలరెడ్డి. ఆయనే బంగోరె.
ఈ అసంపూర్ణ తెలుగు నవలకు ప్రచురణకర్త నెల్లూరు జమీన్ రైతు పత్రికా సహాయ సంపాదకుడు బంగోరె. 1971లోనే బంగోరె దయవల్ల వెలుగు చూసిన ఈ చంద్రిక కథ - నాలుగు దశాబ్దాల తరువాత ఇప్పుడు 2012లో తిరిగి అచ్చుకు నోచుకోడం బంగోరె ఆత్మశాంతిదాయకం.
* * *
''చంద్రికైయిన్ కతై అనునది సాంఫిుక నవల. దాని కథ చాల మనోహరము. మన సాంఫిుక లోపముల బోగొట్టు సంస్కరణోద్దేశముతో భారతి ఈ నవలను రచించెననుట స్పష్టము.
విధవా వివాహము సంఘ క్షేమకరమనియు, బ్రాహ్మణ శాద్రులమధ్యను వివాహమును నిజముగ బ్రేమజనితమైనపుడు నిర్దోషమనియు నిందలి కథవలన సూచితము.
మరియు భారతి సందర్భోచితముగ నీ నవలలో దాక్షిణాత్య సంస్కర్తలలో ముఖ్యుడగు జి. సుబ్రహ్మణ్యయ్యరును, ఆంధ్ర సంస్కర్తలలో నగ్రేసరులైన మహాకవి శ్రీ వీరేశలింగం పంతులు గారిని కథాపాత్రలుగా బెట్టి - వారిట్టి సంస్కరణల కొరకు బ్రచారమును బ్రత్యక్షకృషిని జేసి ధన్యులైనట్లు యధార్థ కథనుగూడ నిందు మిళితముచేసి వివరించినాడు. ఇందువలన భారతికి మన వీరేశలింగంగారి పైన విశేష గౌరవముండెననియు వ్యక్తమయినది''.
