-
-
చందనపు బొమ్మ
Chandanapu Bomma
Author: Aruna Pappu
Publisher: Rashtra Katha Nilayam
Pages: 104Language: Telugu
"వాక్యమంటే రారా చిన్నన్నా... రారోరి చిన్నవాడ... అని ముద్దుగా అన్నమయ్య వేణుగోపాలుణ్ణి పిలిచినంత మార్ధవంగా ఉండాలి. నీలం రంగు నిప్పు పువ్వయి ప్రకాశించాలి, సర్వమూ తానే అయిన వాడిలా వాడిగా లాలించి పాలించాలి. వానవిల్లు మీద నడిచి మేఘాలలో తేలినట్లుండాలి. కాలిగ్రఫీ చిత్రాల్లా కళ్ళకు కట్టాలి. కందర్పకేతువై ఘనధూమకేతువై చుట్టుముట్టాలి. యూనిఫామేసుకుని అప్పుడే స్కూలుకొచ్చిన పిల్లలు ప్రభాత వేళ ప్రార్థన సమయంలో లైనుకట్టి నిల్చున్నట్లుండాలి. అప్పుడప్పుడూ భావాలు ఎర్రకోట ముందు సైనికుల్లా కవాతు చెయ్యాలి. మాటలు ఈటెలు కత్తులూ. అవే చురుక్కుమనిపించే చమక్కులు. మనసుల్ని ముడివేసే మంత్రాలు."
* * *
అరుణ పప్పు తొలి కథా సంకలనం ఇది. ఎమ్మెస్సీ మాథ్స్ చదివినా పాత్రికేయం అంటే ఎంతో ఇష్టంతో దాన్నే వృత్తిగా ఎంచుకున్నారు.
ఐదేళ్ళు 'ఈనాడు'లో చేసి, గడచిన ఐదేళ్ళుగా 'ఆంధ్రజ్యోతి'లో ఫీచర్స్ రిపోర్టర్‌గా పనిచేస్తున్నారు. 'చదువొక వ్యసనం. అక్షరం కనిపించడమే ఆలస్యం చదువుతుంటాను. మంచి వచనానికి, కవితాత్మకమైన పంక్తులకూ త్వరగా ఆకర్షితమవుతాను' అంటారామె. పాత్రికేయ జీవితంలోణి మానవీయ కోణాన్ని ఆవిష్కరించాలని కథలు రాయడం ప్రారంభించారు.
ఆమె భావాల మాలిక 'అరుణిమ' బ్లాగు.
arunapappu.wordpress.com
చందనపు బొమ్మ గురించి విపుల అభిప్రాయం. బుక్ రీడింగ్ ఎక్స్ పీరియన్స్: చందనపు బొమ్మ Written by అరుణ పప్పు