-
-
చాణక్య నీతి
Chanakya Neeti
Author: Avancha Satyanarayana
Publisher: Victory Publishers
Pages: 99Language: Telugu
సంస్కృత సాహిత్యంలో నీతి గ్రంథాలకు విస్తారమైన ప్రచారం ఉన్నది. ఎన్నో గ్రంథాలు నీతిని బోధించేవి ఉన్నాయి. భర్తృహరి సుభాషిత త్రిశతిలోని నీతి శతకం వంటివి ఎన్నో గ్రంథాలు లభ్యం అవుతున్నాయి. ప్రత్యేక గ్రంథాలుగానే కాక, కావ్య పురాణ ఇతిహాస గ్రంథాలలోను ఏమాత్రం సందర్భం వచ్చినా నీతి బోధ విస్తృతంగా చేయబడిన ఉదాహరణలు ఉన్నాయి. అంటే మనుష్యులలో ఉండే చెడు వైపు మనసు మొగ్గే సహజమైన స్వభావాన్ని నిరుత్సాహపరచి, మంచి ఆలోచనలను కలిగేటట్లు చేయటం, బోధించటం, కర్తవ్యాన్ని నిర్దేశించటం నీతి బోధ యొక్క ముఖ్యోద్దేశం. సంస్కృత కవుల పండితుల ఈ ఉద్దేశాన్ని గుర్తించే కావచ్చు తెలుగులో నీతిబోధ గ్రంథాలలో విస్తృతంగా కనిపిస్తుంది. ఆ కారణం చేతనే తెలుగులో నీతి బోధకగ్రంథాలు, ముఖ్యంగా శతకాలు ఎన్నో వెలశాయి. వీటికి ఉన్న ప్రయోజనాలను గుర్తించే చిన్న పిల్లలకు ప్రాధమిక విద్యా స్థాయినుంచే నీతి బోధ జరుగుతున్నది. సంస్కృత భాషలో అతి ప్రాచీన కాలంలోనే వెలసిన నీతి బోధక గ్రంథాలలో 'చాణక్యనీతి' ఒకటి.
ఈ గ్రంథంలో ఎనిమిది అధ్యాయాలుగా ఉన్నది. అందులో మొత్తం 562 సూత్రాలు ఉన్నాయి. ''సుఖస్యమూలం ధర్మః ధర్మం" సుఖానికి మూలం అనే సూత్రం నుంచి "తస్మాత్ సర్వేషాంసర్వ కార్యసిద్ధిర్భవతి" (తపస్సు వల్ల అందరికి కొన్ని కార్యాలు సిద్ధిస్తాయి) అనే సూత్రంతో ఈ గ్రంథం ముగుస్తుంది. దేశంలో ప్రతి పౌరుని యోగక్షేమాలకు ప్రాధాన్యం ఇస్తూ రూపొందించిన రాజ్యపాలనా సంవిధానం చాణక్యుని అర్ధశాస్త్రాదులలో మనకు కన్పిస్తుంది. చాణక్యుడు రాజనీతిసూత్రాణి అనే పేరుతో ఎనిమిది అధ్యాయాలలో 562 సూత్రాలతో ఈ గ్రంథాన్ని కూర్చాడు. వీటిలో చెప్పిన అంశాలలో కనీసం నూటికి ఎనభై అంశాల పరిపాలకులకు, పరిపాలకులకు ఈనాటికి వర్తిస్తాయి, ఉపకరిస్తాయి.
తెలుగువారందరని ఈ చాణక్యనీతి సారము నీతి మార్గంలో నడుపగలదని ఆశంస.
- ఆవంచ సత్యనారాయణ

- ₹60
- ₹60
- ₹648
- ₹60
- ₹1080
- ₹324