-
-
చాళుక్య సింహాసనం
Chalukya Simhasanam
Publisher: Self Published on Kinige
Pages: 400Language: Telugu
ఈ నవల చదువుతుంటే నిజంగా మనం 9వ శతాబ్దం లోకి వెళ్ళిపోయినట్లే వుంటుంది. ఆకాలం మనుషుల ఆభరణాలు ఆయుధాలు నాటి నాణాలు పన్నుల విధానం సాంఘిక చరిత్ర కథావిథానంలోకి ఇమిడ్చివ్రాయడం చిన్నపనికాదు. అలా అని కథాగమనానికి ఎక్కడా ఆటంకం రాకుండా వ్రాయడం విశేషం. పూర్వకాలం శ్రీశైలం కాలినడకన వెళ్ళేవాళ్ళు. అ సన్నివేశంలోకి వెళ్తే మనం కూడ కాలినడకన నడిచినట్లే వుంటుంది, నాటి దొంగల బాధతోసహా! వర్ణనలు సాహిత్యశైలిలో మనోహరంగా వున్నాయి. శైలి మృదు గంభీరంగా వుంది. ఈకాలంలో గ్రాంధికంలోను పౌరాణిక శైలిలోను వ్రాస్తే చదివే పాఠకులు దొరకరు.
ఇలాంటి చరిత్రాత్మక నవలలు ఇదివరకు ఎవరో లల్లాదేవి నోరినరసింహశాస్త్రీ లాంటి వారు వ్రాసేవారు. ఇన్నాళ్ళతరువాత మళ్ళీ అలాంటినవల చూస్తున్నాం.
ఈ నవల చక్కగా స్క్రీన్ ప్లే వ్రాసుకుని సినిమాతీయడానికి అనుకూలంగావుంది.
- పఠాని పాపయ్యరాజు
నవల అంటే ముఖ్యంగా తియ్యగా వుండాలి. చారిత్రాత్మక నవల గంభీరంగా కూడ వుండాలి. ఈ నవల తీయ్యటి మామిడిపండులా వుంది. అంతేకాదు. ఈ నవల చదువుతూ ఆనాటి ప్రపంచంలోకి వెళ్ళిపోతాము. అప్పటికీ ఇప్పటికీ ఎన్నోమారాయి. కాని స్త్రీ, పురుషుడు వారిమధ్య ప్రేమ మోహము ఆకర్షణ రాగము ద్వేషము స్నేహము వైరము లాంటివేవీ మారలేదు. ఈ పుస్తకంలో మనం మరచిన చరిత్ర సంస్కృతీ నీతులు ధర్మశాస్త్రాలు మంత్రసిధ్దులు హిందూమత జైనమత సాంప్రదాయాలు అందమైన వర్ణనలు యుద్ధతంత్రాలు ఎన్నోఎన్నో వున్నాయి.
ఈ నవలలో నాయికానాయకుల మధ్య ప్రణయం ఎంతో ఉదాత్తంగా పోషింపబడింది. ఇందులో వైవిధ్యంగల స్త్రీపాత్రలు శరత్ సాహిత్యంలో శ్రీకాంత్ నవలను గుర్తుచేస్తున్నాయి.
ఒక పుస్తకం మళ్ళిమళ్ళి చదవాలనిపిస్తే అందులో గొప్పతనం ఏదో వున్నట్లే. ఈనవల మళ్ళిమళ్ళి చదవాలనిపిస్తుంది. అందుకే కొనిదగ్గరుంచుకోవడం మంచిది.
- ఆదుర్తి బాల
