• Challapalli Estate Rytaanga Poraatam
  • fb
  • Share on Google+
  • Pin it!
 • చల్లపల్లి ఎస్టేట్ రైతాంగ పోరాటం

  Challapalli Estate Rytaanga Poraatam

  Pages: 141
  Language: Telugu
  Rating
  4.50 Star Rating: Recommended
  4.50 Star Rating: Recommended
  4.50 Star Rating: Recommended
  4.50 Star Rating: Recommended
  4.50 Star Rating: Recommended
  '4.50/5' From 2 votes.
  4 Star Rating: Recommended
  4 Star Rating: Recommended
  4 Star Rating: Recommended
  4 Star Rating: Recommended
  4 Star Rating: Recommended
  '4/5' From 1 premium votes.
Description

జమీందారులు చాలామంది రాజులమని, మాహారాజులమని, పట్టాభిషేకములని పగటి వేషగాళ్ల వలె వేషములు వేసికొని తిరిగేవాళ్లు. నిజానికి వీళ్లు ఏనాడూ రాజులుకాదు. రాజ్యాలు ఏలలేదు. నిజాం దగ్గర, తరువాత బ్రిటిష్‌ సామ్రాజ్యవాదుల దగ్గర సలాములు చేస్తూ, అడుగులకు మడుగులొత్తుతూ, రైతులనుండి శిస్తు వసూలు చేసే ఏజెంట్లుగా వుండేవాళ్లు. పూర్వం ఒకనాటి బ్రిటీష్‌ గవర్నర్‌ జనరల్‌గా ఉన్న విలియం బెంటింక్‌, జమీందారీ విధానాన్ని గురించి చెబుతూ, ''జమీందారీ పద్ధతి ఇతర విధాలా నిష్ప్రయోజనమైనా, ఒకందుకుబాగా ఉపయోగించింది. ప్రజల మీద బాగా పలుకుబడి కలిగివుంటూ బ్రిటీష్‌ పరిపాలన నిలకగా వుండలని వేరే భూ కామందులు ఇందువల్ల ఏర్పడ్డరు. ప్రజలు తిరుగుబాటు గావించి నపుడు వీరు ఆ ప్రజా విప్లవానికి చెలియలికట్టగా మనకు చక్కగా ఉపయోగ పగలరు'' అని చెప్పినది అక్షరాల వీళ్లు అమలు పరుచడమే కాకుండ జలగలవలె పేద రైతాంగం యొక్క రక్తం పీల్చారు.

శ్రీయుతులు చండ్ర రాజేశ్వరరావు, చలసాని వాసుదేవరావు, చల్లపల్లి నారాయణరావు, చలసాని జగన్నాధరావుల నాయకత్వాన రైతులు జమీందారు వ్యతిరేక పోరాటాలు చేపట్టారు. దాదాపు 40 సంవత్సరాల ఈ పోరాట ఫలితంగా జమీందారీ రద్దు జరిగి అతని ఆక్రమణలోనున్న భూమిని 11,000 మంది రైతు కూలీలకు భూ పంపకాలు జరిగాయి. ఈ ఎస్టేట్‌లో జరిగిన ఈ పోరాటంలో పాల్గొన్న 35 మంది రైతు బిడ్డలు పోలీసు తుపాకీ గుళ్లకు, జమీందారీ రౌడుల చిత్రవధలకు గురి అయ్యి ప్రాణాలు అర్పించారు.

ఆంధ్రదేశంలో జరిగిన ఈ 'చల్లపల్లి జమీందారీ వ్యతిరేక పోరాటం' ఆంధ్రప్రదేశ్‌ కమ్యూనిస్టు ఉద్యమంలోనూ, రైతు-కూలీ ఉద్యమంలోనూ చిరస్థాయిగా చారిత్రాత్మక పోరాటంగా నిలిచిపోతుంది.

చరిత్ర యావత్తూ పోరాటం కాకపోవచ్చు. కానీ పోరాటం మాత్రం చరిత్రే, చల్లపల్లి ఎస్టేట్లో తమ భూమిని దక్కించుకోవటానికి రైతుబిడ్డలు వీరోచితంగా పోరాడిన గాధకి అక్షర రూపం ఈ గ్రంధం.

Preview download free pdf of this Telugu book is available at Challapalli Estate Rytaanga Poraatam