-
-
చలపాక ప్రకాశ్ కార్టూన్లు 2
Chalapaka Prakash Cartoons 2
Author: Chalapaka Prakash
Publisher: Ramyabharathi
Pages: 56Language: Telugu
మిత్రులు చలపాక ప్రకాశ్ బహుముఖ ప్రజ్ఞాశాలి. ''చప్ర'' కవి, రచయిత, జర్నలిస్టు, కార్టూనిస్టు, గేయాలు రాయగలడు, కథలు చెప్పగలడు, జోకులు వేయగలడు, వ్యాసాలు రాయగలడు, కార్టూన్లు చిత్రించగలడు. అతనిలో సామాజిక చైతన్యం వుంది. సమాజానికి యేది మంచిదో అది యివ్వాలని చూస్తాడు. సామాజిక స్పృహ గలవాడు. జనాలకు పనికి వచ్చే రచనలు చేయడం, జనాలను మేలుకొల్పే పాటలు రాయడం, ప్రజలను చైతన్యపరిచే వ్యాసాలు రాయడం, ఆలోచింపచేసే జోకులు వేయడం, జనంతో ఆత్మవిమర్శలు చేసుకునేలాంటి కార్టూనులు గీయడం అతనికలవాటు. మితభాషి గనుకనే అతని భావాలను అక్షరాలలోను, రేఖలలోనూ వెల్లడించడం అలవరుచుకున్నాడు. అందులో నేర్పును, నైపుణ్యాన్ని ప్రదర్శించగలుగుతున్నాడు. అందుకే ఆయా రంగాలలో అవార్డులను అందుకుంటున్నాడు.
ఈ చిరు గ్రంథంలో కొన్ని కార్టూనులను సమాజానికి అర్పిస్తున్నాడు. అవి నవ్వించడమే కాదు, ఆలోచింపజేస్తున్నాయి. సమాజంలోని చెడుగులను కడిగేస్తున్నాయి. రోగులకు తియ్యటి మందుతో చికిత్స చేస్తుంటాయి. సమాజంలోని అలవాట్లను, ఆలోచనలను శుద్ధి చేస్తున్నాడు. చలపాక సామాజిక వైద్యుడు.
తను ఎంచుకున్న రంగాలన్నిటిలోనూ మరింత కృషి చేసి, మరింత స్ధాయిలో శ్రమించి సామాజిక సంస్కర్తగా ఎదుగుతాడని ఆశిస్తున్నాను.
- టి. వెంకట్రావ్ (టీ.వీ)

- ₹60
- ₹36
- ₹60
- ₹36
- ₹10.8
- ₹60