-
-
చలం సాహిత్య సంగ్రహం
Chalam Sahitya Sangraham
Author: Gudipati Venkatachalam
Publisher: Chalam Foundation
Pages: 504Language: Telugu
“చలాన్ని యిష్టమయినవాళ్ళు చదువుతారు. లేనివాళ్ళు లేదు. ఎట్లాగయినా సరే చలం సాహిత్యాన్ని రుచి చూపించి, విస్తారంగా చదవటానికి పాఠకులను ఉన్ముఖం చేయాలన్న ప్రయత్నం ఎందుకు మీకు? చలం అంత అవసరమా?” అని కొంతమంది మిత్రులు అడిగారు. మరికొంతమంది అడగబోతారు. ముందే సమాధానం చెప్పేస్తే మంచిది.
చలం యింకా అవసరమే. ఆయన నెత్తికెత్తుకున్న సమస్యలు తీరినప్పటికీ, ఎప్పటికీ తీరనివి గూడ కొన్ని మిగిలే ఉంటాయి. ఒకవేళ అన్నీ తీరినా ఎప్పటికీ చలం అవసరమే. బహుముఖీనంగా మనసులు విప్పారాలంటే చలాన్ని చదివి తీరాలి. సాధారణ ఆలోచనలకు ఇకొకవైపు గూడ ఉంటోందని తెలియటానికి చలం సాహిత్యం అవసరం. కాదని తిరస్కరించటానికయినా చలాన్ని ఇంకా చదవాలి. చదవకుండానే తిరస్కరించటం అసాధ్యమయిన రచయిత. మన ఊహాశాలిత, భావుకత, మన ప్రక్కనే మామూలుగా పడివున్న వాటిలో గూడ, సౌందర్యాన్ని, అసాధారణతను చూడగల కొత్తచూపు వికసించాలంటే చలం తప్పనిసరి. ఈ అవసరాలకు ఈయనకాక మరొక తెలుగు రచయిత వెంటనే స్ఫురించడు.
భాషకోసం గూడ చలం కావాలి. నిరాడంబర వేగంకోసం, ఛాతీ మీద బలంగా తాటించగల తెలుగుకావ్యం కోసం ఇంకెవరి దగ్గరకు వెడతాం? చలంకాక. విశ్వనాథవారే అన్నట్లు, తెలుగుభాష, తెలుగు ప్రకృతి, ఉన్నన్నాళ్ళు చలం రచనలు ఉంటాయి. 'తెలుగు అక్కరలేదు' అనుకునే భ్రాంతచిత్తుల తరం సంగతి తెలియని రోజులలో శ్రీ విశ్వనాథ అన్న మాటలవి. ఇందుకనే, చలాన్ని స్థాలీపులాకంగానయినా పరిచయం చేయటం, కొత్త పాఠక తరానికి మేము చేయగల సాహిత్య సహాయం అనిపించింది.
తెలుగు సాహిత్యంలో ఎవరికీ లేని ప్రత్యేకత చలంగారిది. తనను తానే అన్వేషించుకుంటూ ఒక వ్యక్తి ఎంతదూరం ప్రయాణించగలడో అంతదూరం ప్రయాణం చేసిన వ్యక్తి చలంగారు. మొహమాటం లేకుండా, లోకనిందకు జంకకుండా తన ప్రయాణాన్నంతా రచనల్లో కూర్చిన వ్యక్తి చలంగారొక్కరే.
ఏర్చిన రచనలను కాలక్రమానుసారిగా కుర్చితే చలం భావపరిణామం ఆనవాళ్ళుగూడ తెలుస్తాయని, ప్రక్రియా ప్రధానంగా కాకుండా కాలానుసారంగా వరుస క్రమాన్ని పేర్చాము. అయితే స్పష్టమయిన రచనా కాలం తెలియకపోవటంచేత ఈ రచనలను ఉజ్జాయింపు క్రమంలో మాల కట్టాము.
- వావిలాల సుబ్బారావు
గమనిక: "చలం సాహిత్య సంగ్రహం" ఈ-బుక్ సైజు 40 MB
Could any one of you or Kinige team, confirm that this book contain Chalam's original/own/unabridged version of his writings? Or is this a commentary/thesis by some one on Chalam's works?
ఇందులో ఏమున్నాయో పట్టికలా ఇస్తే అనువుగా వుండేది.
నేను వెతుకుతున్న "బ్రాహ్మణీకం" ఇందులో లేదు.
NAMMINA SIDHAMTANIKI ANKITAMAINA MAHAMANISHI
One great humanbeing
Any chance that chalam's books to come as ebooks ?