-
-
చక్రతీర్థం
Chakrateertham
Author: Madhubabu
Publisher: Sri Srinivasa Publications
Pages: 440Language: Telugu
Description
యాభై సంవత్సరాలక్రితం డిపాజిట్ చేసిన రెండు లక్షల రూపాయలు, ఇప్పుడు ఎంత ఎమౌంట్కి ఎదిగివుంటాయో మనసులోనే లెక్క కట్టాడు రవిబాబు.
“ఎంత తక్కువ వడ్డీ కట్టినా అది కోటి రూపాయలకు పైనే అయి వుంటుంది. పాండురంగరాయుడి వారసులు ఎవరైనా వస్తే, అణాపైసలతో సహా వారికి అప్పచెప్పాల్సిన బాధ్యత మనమీద వుంది. ఈ విషయం బాగా గుర్తుపెట్టుకో..” అంటూ సోఫాలో నుంచి లేచాడు దొరగారు.
“నాకు నిద్ర వస్తోంది. నేను వెళ్ళి పడుకుంటాను. నువ్వు కూడా వెళ్ళు. రేపు ఉదయమే కొండలమ్మతల్లి దగ్గరికి పోవాలి” అంటూ తన గది వైపు వెళ్ళిపోయాడాయన.
నిప్పులవంటి కళ్ళతో నిర్భయంగా చూస్తూ, మహాకరుకుగా నిలబడి వున్న పాండురంగరాయుడిని అంతకు ముందెక్కడో చూసినట్టనిపిస్తోంది రవిబాబుకి.
‘వంద సంవత్సరాల క్రితం మనిషి ఇతను... మనకి కనిపించటం అసంభవం....’ అని తనలో తనే అనుకుంటూ నెమ్మదిగా తన గదివైపు వెళ్ళి పోయాడు.
Preview download free pdf of this Telugu book is available at Chakrateertham
నేను కినిగె నుండి చక్రతీర్థం
బుక్ కొనుగోలు చేశా కానీ డౌన్లోడ్ కావటలేదు నేను ADE install చేశా ADOBE ID తో
నా కంప్యూటర్ ని authorize చేశా కానీ బుక్ డౌన్ లోడ్ కావటలేదు
Plz make print book available
poor plot and execution. First time i have skipped so many pages in between. Totally disappointed.