-
-
చైతన్య దీపికలు
Chaitanya Deepikalu
Author: Dinavahi Satyavathi
Publisher: Malleteega
Pages: 85Language: Telugu
Description
కథ రాయటమే ఒక సవాల్. అదీనీ పిల్లల్లోని సద్గుణాలను, వారికి వచ్చే ఆలోచనలనూ, సవాళ్ళనూ, సందేహాలనూ వారి మనస్సుల్లో పరకాయ ప్రవేశం చేసి, గ్రహించి, తగురీతిగా పిల్లల సమస్యలను ఎంచుకుని, వారిలో ప్రవేశపేట్టాల్సిన సగుణాలను మనస్సులో ఉంచుకుని ఆ విధానంలో చక్కగా కథలు మల్చడం ఒక గొప్ప సాహసమే. దాన్లో ఆరి తేరారు రచయిత్రి దినవహి సత్యవతి. ఆమె కథల్లోకి తొంగిచూస్తే, ఆమె చాతుర్యానికి లొంగిపోక తప్పదు.
ఉదాహరణకు ఆమె పిల్లల సాహిత్యానికి ‘చైతన్యదీపికలు’ పేరు జతచేసిన కథల పుస్తకంలోని 15 కథల్లో ఆమె పిల్లలకు, వారి ద్వారా పెద్దలకూ ఇవ్వదలచిన సందేశం స్పష్టంగా తెలుస్తున్నది. ఒకమారు ఒక్కో కథనూ చూద్దాం...
- ఆదూరి హైమావతి
Preview download free pdf of this Telugu book is available at Chaitanya Deepikalu
సత్యవతి గారు వ్రాసిన చైతన్య దీపికలు పుస్తకము లోని కథలు చదువుతుంటే పిల్లలకు విజ్ఞానాన్ని ,వినోదాన్ని ,నీతిని రంగరించి పంచి పెట్టినట్లు భావన నాకు కలిగింది .ఒక్కొక్క కథ ఒక నీతి గుళిక.తప్పక పిల్లల అందరికీ ఉపయోగ పడే మంచి పుస్తకము అని నా అభిప్రాయము .