-
-
చదువు తీర్చిన జీవితం
Chaduvu Tirchina Jeevitam
Author: Kallakuri Seshamma
Publisher: Smrithi Publications
Pages: 149Language: Telugu
చెట్టుకు వేరు, భవనానికి పునాది, సమాజానికి మధ్యతరగతి --- మహాముఖ్యం. పేరు వెనుక డిగ్రీలు, పేరేన్నిక గన్న పదవులు గట్రా ఏమీ ఉండవు. అయినా వారి అస్తిత్వం ఒక వారసత్వ సంపద. వారి జీవన వ్యూహం విలువల పరిరక్షణ.
వీళ్ళలో రోజూ ఆఫీసుకు వెళ్లొచ్చే ఉద్యోగి, పరాయమ్మ కన్న బిడ్డకి మంచి మార్కులు వస్తే కడుపు నిండిపోయినట్టు ఆనందించే ఒక టీచరమ్మ ఉంటారు. అలా మెలకువ, ఓర్పుతో నిదానంగా తన జీవితం చక్కదిద్దుకుని ప్రయోగాత్మకంగా,
ప్రయోజనాత్మకంగా కాలం గడిపిన ఒక సాధారణ మహిళ జీవిత గాధ ఇది.
పాజ్ బటన్, ఇంటర్వెల్ బ్రేకు, అన్నీ ఉన్న చలన చిత్రమిది. చిన్ని చిన్ని సంతోషాలు, ఓ మోస్తరు దుఃఖాలు కలబోసుకున్న కథ. కొందరు ఈ తరం డాక్టర్లు, ఇంజనీర్లు, ఉన్నత ఉద్యోగస్తులు గురుపూజోత్సవం వస్తేనో, తమ పిల్లల్ని పెంచుకుంటూనో "ఔను. మా టీచర్ ఇదే అనేవారు" అని తలచుకునే ఒక మధ్యతరగతి టీచరమ్మ చెప్పిన కథ. ఇదొక జీవన సంగీతం. సంసారపు సరిగమలు, చదరంగంలో ఎత్తు, దిగుళ్ళు అదనం సుమండీ.
"చదువు తీర్చిన జీవితం" ఒక సామాన్య మహిళ ఆత్మకథ.
- పబ్లిషర్స్
