-
-
ఛ.... నోర్ముయ్
Cha Normuy
Author: Dr. V. Brahma Reddy
Publisher: Jayanthi Publications Vijayawada
Pages: 58Language: Telugu
"ఛ.... నోర్ముయ్" అనే పేరుతో ఈ లఘు నాటికలు (స్కిట్స్) గతంలో "చెకుముకి" పిల్లల మాస పత్రికలో వెలువడ్డాయి. ఆ లఘు నాటికలకు మరి కొన్ని కొత్తగా కలిపి, అవసరమైన చోట్ల సవరించి పుస్తకంగా తెస్తున్నాను.
"పిల్లలు నుండి ప్రశ్నలను అనుమతించండి" అనే అభ్యర్థన ఇందులోని ముఖ్యాంశం. పిల్లలు సహజంగానే ప్రశ్నల పుట్టలు. వాళ్ళడిగే ప్రశ్నలన్నింటికీ మనకు జవాబులు రానప్పుడు "ఛ.... నోర్ముయ్" అని అదిలిస్తాము. అలా నోరు మూసి, మూసి ఆ పిల్లలు మనలా పెద్దవాళ్ళయ్యే సరికి శాశ్వత ప్రతిపాదికన "ప్రశ్నించడం" మానేస్తారు. అప్పుడు మనకు బోలెడు సంతోషం కల్గి, "మా పిల్లలకు ఎంత క్రమశిక్షణో" అని సంబరపడి ఊరంతా ప్రచారం చేస్తాం.
ప్రశ్న ప్రగతికి మూలం. ప్రశ్న పరిశీలనకూ, పరిశోధనకూ దారితీస్తుంది. మానవ విజ్ఞానమంతా "ప్రశ్న" దగ్గర్నుంచే మొదలైంది. ఎందుకు? ఏమిటి? ఎలా? ఎవరు? ఎక్కడ? ఎప్పుడు? ... ఇలాంటి ప్రశ్నలు జీవితావసరం.
మనకు కల్గే అనేక ప్రశ్నలు పిల్లలకూ కల్గుతాయి. మనం అడగం, అడగలేం. అడగడం మర్చిపోయాము. పిల్లలు అడుగుతారు. అడగగలరు. అడగడం ఇంకా మర్చిపోలేదు. పిల్లల్ని చూసి అడగడం "తిరిగి" నేర్చుకుందామని నా మనవి.
- డా. బ్రహ్మారెడ్డి
జన విజ్ఞాన వేదిక
