-
-
కెరీర్ టిప్స్
Career Tips
Author: Dr. T. S. Rao
Publisher: Victory Publishers
Pages: 100Language: Telugu
ప్రతి ఒక్కరిలో సృజనాత్మక శక్తి వుంటుంది. వుండి తీరుతుంది. క్రియేటివిటీ వుండాడానికి గొప్ప - బీద, చిన్న - పెద్ద, ఎక్కువ, తక్కువ, ఆడ - మగ అన్న తేడా లేనే లేదు. వుండనే వుండదు. టింకర్, టైలర్, సోల్జర్, సైలర్, కెప్టెన్, పైలెట్ ఇలా ఒకరనేమిటి ప్రతి ఒక్కరిలో వారి వారి రంగాలలో వారి పరిగణలో సృజనాత్మక ప్రతిభ వుండి తీరుతుంది.
సృజనాత్మక శక్తి వుండానికి వయస్సు అడ్డంకి కానేకాదు. దానికి వయో పరిమితి లేనే లేదు. ప్రసిద్ధ రచయిత అయినటువంటి సోమర్సెట్ మాఘమ్ ఎన్నోకొత్త పుస్తకాలను తన 80వ ఏట వ్రాశారట. మార్కెట్వయిను తన 71వ ఏట రెండు పుస్తకాలు రచిస్తే, మిల్టన్ 57వ సం||లో ''పారడైజ్ లాస్ట్'' గ్రంధం రాస్తే 62వ ఏట 'పారడైజు రీగెయిన్టు' రచించాడు. వర్డి తన 81వ ఏట 'ఫాల్స్టాప్'ను కంపోజు చేశాడు. కాబట్టి క్రియేటివిటి అనేది కొంతమందికి పుట్టుకతో వస్తుంది. మరి కొంతమందికి వయసుతోపాటు అది పెరుగుతూ వస్తుంది. వయసు మీరుతున్న కొద్దీ కొందరిలో సృజనాత్మకత శక్తి మరింత పరిఢ విల్లుతుంది. ఎందుకంటే ఊహాత్మక శక్తి కొన్ని అభ్యాసాల ద్వారా, ప్రయోగాల ద్వారా, వ్యాయామం ద్వారా మరింత విస్తృతమవుతుంది. తద్వారా బుద్ధి వికసిస్తుంది.
