-
-
కేక్స్ - సూప్స్ - ఐస్ క్రీమ్స్
Cakes Soups Ice Creams
Author: Yalamarti Anuradha
Publisher: Victory Publishers
Pages: 173Language: Telugu
ఆరోగ్యకరమైన, రుచికరమైన కేక్స్, సూప్స్, ఐస్ క్రీమ్స్ ఇంట్లోనే తయారు చేసుకునే పద్ధతులు వివరిస్తున్నారు రచయిత్రి. ఇవే కాకుండా, ఈ పుస్తకంలో చాక్లెట్లు, టాఫీలు, బిస్కట్లు, సలాడ్స్, స్క్వాషెస్, షర్బత్‌లు, షేక్స్, జ్యూస్‌లు, పలురకాల పానీయాలు, మజ్జిగ పానీయాలు, కస్టర్డ్‌లు, జామ్స్, సాస్‌లు ఎలా తయారుచేసుకోవాలో తెలియజేసారు.
* * *
పుట్టినరోజు అనగానే కేక్స్ కంపల్సరీ. మన పిల్లలకి, మనకిష్టమైనవారి పుట్టినరోజు ఫంక్షన్లకు మనమే తయారు చేసిన కేక్‌ని అలంకరిస్తే ఎంతో తృప్తిగా ఉంటుంది. అంతే కాకుండా మాములుగా మన ఇంట్లోకి కూడా చేసుకోవచ్చు. ఆరోగ్య రీత్యా కూడా ఎంతో మంచిది. మరి కేక్ వెరైటీస్ ఏమిటో చూద్దాం! చేసేసుకుందాం.
* * *
'సూప్స్' భోజనానికి ముందు త్రాగడం అలవాటు చేసుకోవాలి. దీని వలన బలం, ఆరోగ్యం రెండూ చేకూరుతాయి. ఏ పెళ్ళికి వెళ్ళినా, ఏ ఫంక్షనుకి వెళ్ళినా ముందుగా 'సూప్స్' సర్వ్ చేస్తున్నారు. తేలికగా జీర్ణమయి, మనకి ఉపయోగపడే సూప్స్ గురించి తెలుసుకోకపోతే ఎలా?
* * *
వేసవికాలం ఎండలకు చల్లచల్లగా ఉండే ఐస్‌క్రీమ్స్ తినడం ఇష్టంలేని వారు, ఆ హాయి అనుభవించాలనుకోని వారు ఉండరు. అవునా! అందుకని రకరకాల ఐస్‌క్రీమ్స్ ఎలా చేయాలో తెలుసుకుందాం!
- యలమర్తి అనూరాధ
