-
-
బర్మా డాల్
Burma Doll
Author: Madhubabu
Publisher: Madhubabu Publications
Pages: 108Language: Telugu
“మగధాన్ ఏరియాలో నివశించే అహూజా విశ్రాంతి కోసం ఈ బిల్డింగ్‌ని కట్టించుకున్నాడు. దాని అడ్రస్ చాలా రహస్యంగా వుంచాడు. ముక్కు ముఖం తెలియని ఆగంతకులు మన కోసం యిక్కడ వెయిట్ చేస్తున్నారంటే పరిస్థితి మనం అనుకున్న దానికంటె కాంప్లికేటెడ్ అనిపిస్తోంది” ఫైటింగ్ సమయంలో ఒక గోడకు పొడుచుకొని పోటెత్తిపోతున్న భుజాన్ని తడుముకుంటూ సాలోచనగా అన్నాడు షాడో.
“ఊరికే వెయిట్ చేయటం కాదు.. అవరమయితే అతివేగంగా మాయం కావటానికి మార్గాన్ని సిద్ధం చేసుకొని మరీ ఎదురు చూస్తున్నారు దుర్మార్గులు...” అంటూ శ్రీకర్ తమతో లేడని గ్రహించి ఖంగారు పడ్డాడు ముఖేష్.
“వేరార్యూ శ్రీకర్? ఆర్ యూ ఆల్ రైట్?” కనులు చిట్లించి చుట్టూ చూస్తూ అతన్ని పిలిచాడు.
“ఆల్రైట్గా వుండక ఏమైపోతానని మీ వుద్దేశ్యం? గంటనుంచీ ఎదురుచూస్తున్నాను మీ కోసం రండి రండి - తొందరగా రండి” వెంటనే వినవచ్చింది శ్రీకర్ కంఠం మెట్ల క్రింది నుంచి.
అడుగుకు ఆరు మెట్ల చొప్పున దిగుతూ క్రిందికి చూశారు షాడో, ముఖేష్.
