-
-
బృందావనం
Brundavanam
Author: Akella Venkata Subbalakshmi
Publisher: Self Published on Kinige
Pages: 62Language: Telugu
ఆసక్తికరంగా చెప్పాలేగాని - కథలంటే ఇష్టపడని వారుండరు. నిద్రవొచ్చేదాకా కథ చెప్పమని పోరు పెట్టే- చిన్న పిల్లలు మనకు తెలుసు. కథలు బాగా విని, మంచీ చెడులు గ్రహించే బాలలే కమ్మని జీవితం పొందుతారు. కథలు చదవటంవల్ల, వినటంవల్ల ఆనందమే కాదు- తెలివి తేటలు కూడా అలవడుతాయి. ఉపాయం చెప్పే కథల ద్వారా ఉన్నత శిఖరాలకు చేరుకున్న గొప్పవాళ్ళెందరో మనకు తటస్థపడుతుంటారు. అటువంటి బాలల కథలు తెలుగు సాహిత్యంలో పుష్కలంగా కనబడుతాయి. ఇప్పటికీ ఈనాటి బాలలు రేపటి ఉత్తమ పౌరులుగా తయారుకావటానికి ఆ కథలు స్ఫూర్తిగా నిలుస్తాయని ఖచ్చితంగా చెప్పొచ్చు.
సాంకేతిక మాధ్యమాలు చిన్న పిల్లలను తీవ్రంగా ప్రభావితం చేస్తున్న తరుణమిది. వాటికి తోడు చదువుల ఒత్తిడి. అంతకుమించి మార్కుల ఒత్తిడి. దారి మళ్ళించటానికి ఎన్ని కావాలో అన్ని చేరువలో ఉన్న కాలం యిది. చెరుపు చేస్తున్న కాలం. ఈ దశలో బాలలను బాలలుగా కాపాడగల శక్తి బాల సాహిత్యానికే ఉందని నా భావన. చిన్న పిల్లలది స్వచ్ఛమైన మనసు. ఎలా తీర్చిదిద్దితే అంతమంచిగా తయారవుతుంది చురుకుదనం, సున్నితత్వం, మంచితనం, మానవత్వం మొదలైనవన్నీ కథల ద్వారా పిల్లల మనసుల్లో నాటవచ్చు. అటువంటి మంచి ఉద్దేశ్యంతో బాలల కథలు రాస్తున్న రచయిత్రి ఆకెళ్ళ వెంకట సుబ్బలక్ష్మి. బాలల కథా రచనను బాధ్యతగా భావించింది కనుకనే 'బాలనందనం', 'బాలమందారం', 'బాల కుటీరం', 'లోభి' 'మన ఇష్టం' వంటి బాల కథాసంపుటాలను బాలల సమాజానికి అందించింది. అదే వరుసలో ఇప్పుడు 'బృందావనం' పేరుతో మరో బాలకథాసంపుటిని రచించి బాలలకు బహుకరిస్తున్నది రచయిత్రి.
- డా. నందిని సిధారెడ్డి
