-
-
బృహత్సంహిత - 1
Bruhatsamhita 1
Author: Dr. Sishtla Umamaheswara Sarma
Publisher: Mohan Publications
Pages: 277Language: Telugu
సంస్కృత శ్లోక తాత్పర్యం భట్తోత్పల వ్యాఖ్యానం తెలుగులో రావడం ఇదే మొదటిసారి. శ్రీమాన్ శిష్ట్లా ఉమామహేశ్వరశర్మ గారి ప్రయోగం అద్భుతంగా ఉంది. ఒక విధముగా చెప్పాలంటే వారు చాలా సాహసం చేశారు అని అనుకోవచ్చు. ఇప్పటివరకు తెలుగులో చాలా జ్యోతిష గ్రంథాలు అనువాదం జరిగాయి కాని బృహత్సంహిత మాత్రం జరుగలేదు. బహుశా వీరికోసమే అనుకుంటా ఈ గ్రంథం ఇంకా ఎవరూ అనువాదం చేయలేదు. శిష్ట్లా వారి రచనాశైలి చాలా సరళమైన బాషతో సంస్కృత పరిజ్ఞానం తక్కువగా ఉన్నవారికి కూడా సులభంగా అర్ధం అయ్యేవిధముగా వ్రాయడం చాలా ప్రశంశనీయం. సందేహం ఉన్న శబ్దాలకు అమరకోశములో ఉన్న శబ్దాలను సందర్భానుసారముగా సమన్వయముచేయడం చాలా కష్టం. దీనినిబట్టిచూస్తే సంస్కృతం పై వారికున్న పట్టు మనకి అర్ధం అవుతుంది.
సంహితా భాగములో అత్యున్నతమైనది అతి ప్రామాణికమైన గ్రంథం ఈ బృహత్సంహిత, ఇందు ఉన్న విషయాలు నేటి సామాజిక పరిస్థితులకి సరిపోవుచున్నవి. ఈ రోజున వాతావరణంపై పరిశోధన చేసేవారికి ఈ గ్రంథం చాలా ఉపయుక్తముగా ఉంటుంది.”రోహిణి, స్వాతి, ఆషాడియోగం”, ఉత్పాతాలు, భూకంపాలు, ఉల్కపరివేష, గంధర్వ నగర ఇత్యాదివి. వీరు పడిన శ్రమ చూస్తే చాలా ఆశ్చర్యం కలిగింది. కొన్ని అధ్యాయాలలో కొన్ని పదాలు వ్యావహారిక భాషలో ఎలా ఉన్నాయి వాటిని ఎలా సమన్వయము చేయాలి అని ఆలోచన చేసి అమరకోశములో ఇంకా ఎన్నో ఎన్నెన్నో నిఘంటువులను పరిశీలించి వ్రాయడం అన్నది చాలా కష్టం.
- గొడవర్తి సంపత్‌కుమార్ అప్పలాచార్యులు

- FREE
- FREE
- FREE
- FREE
- FREE
- FREE