-
-
బృహత్ వైద్య రత్నాకరం
Bruhat Vaidya Ratnakaram
Author: Venkatacharya Pandit
Publisher: Mohan Publications
Pages: 544Language: Telugu
“పూర్వజన్మకృతం పాపం వ్యాధిరూపేణపీడితా
తచ్ఛాంతి రౌషధైర్ధన్యైర్థపహెూమసురార్చనైః"
అను స్మృతి వచన ప్రకారము, పూర్వజన్మమునందుఁ జేఁయబడిన పాపము ఈ జన్మమున రోగరూపమై బాధించుననియు, అది ఔషధములు, దానములు, నవగ్రహజపములు, హోమములు, దేవతా పూజలు, లోనగు వాని వలన శమించుననియు స్పష్టమగుచున్నది కదా? మరియు, “ధర్మార్థ కామ మోక్షాణామారోగ్యం మూల ముత్తమం! రోగా స్తస్యాపహర్తార శ్శ్రేయసో జీవితస్య చ | తేషాం ప్రశమనోపాయ మతివిస్తారరంహసాం | ఆయుర్వేద విధి న్తేషాం రోగాణాం పరినాశకః” అను వచన ప్రకారము ధర్మము, అర్థము, కామము, మోక్షముననెడి చతుర్విధ పురుషార్థముల సాధించుటకు శరీరారోగ్యము ముఖ్యకారణంబై యున్నది. అట్టి ఆరోగ్యంబును శ్రేయస్సును జీవితము గూడ అపహరించునని రోగంబులు, కావున నతివిస్తారమైన బలముగల యారోగంబులు ఆయుర్వేద విధుల వలన గాని శమింపవు, అట్టి రోగ శమనోపాయంబుల నెఱుంగుటకు ఆయుర్వేద గ్రంథంబు లనేకంబులుండినను, పై జెప్పిన ఔషధ-దాన-హోమాది విధులఁ దెల్పు గ్రంథంబులు తఱచుగ లేకుండుటం జేసి, ఆయారోగనిదాన చికిత్సాదుల నెల్లవారును సులభంబుగఁ దెలసికొనుటకై - జ్యోతిష-కర్మవిపాక-ఆయుర్వేద శాస్త్రము లందుఁ జెప్పబడిన రోగనిదాన చికిత్సాదులన్నియు నొక్కచోఁ గలిగియుండునట్లు వేంకటాచార్య పండితులచే రచింపబడిన “బృహత్ వైద్య రత్నాకరం” అనెడి యీ వైద్య శాస్త్రమును, సంస్కృత శ్లోకములు గలిగి యుండిన గ్రంథ విస్తరమగునని ఔషధాదిప్రకరణములందు ఆ శ్లోకముల యర్థమును మాత్రము సంగ్రహించి ఆంధ్రభాషయందు వ్రాసి సర్వజనోపయోగార్ధము ముద్రింపింపనయ్యెను. లోఁగడ ముద్రింపఁబడిన ప్రతులన్నియు విక్రీతంబులై ప్రకృతము దొరకకుండుటచే ఇప్పుడీ ద్వితీయ ముద్రణము గావింపఁబడియె. కొన్ని ప్రతులె ముద్రింపబడినవి గనుక వలయువారాలస్యము సేయక తెప్పించుకొని పఠించి ఆయురారోగ్య సంపదలఁ బ్రపింపఁగోరెదను.
- తెన్మఠము శ్రీరంగాచార్యులు

- FREE
- FREE
- FREE
- FREE
- FREE
- FREE