• Brahma Likhitham
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 86.4
    96
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • బ్రహ్మలిఖితం

    Brahma Likhitham

    Publisher: Surya Prachuranalu

    Pages: 141
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

శ్రీమతి వావిలికొలను రాజ్యలక్ష్మి గారు సున్నితమైన అనేక భావాలను ఆకర్షణీయమైన శైలిలో కథానికలుగా రచించిన రచయిత్రిగా పేరు గడించారు. భావకవితా ధోరణి ఈమె కథల్లో గోచరిస్తుంది. తన చుట్టూ ఉన్న, తన యింటిలో ఉన్న లేక బంధువుల ఇళ్లలోని విషయమైనా ఆమె కథానికకు వస్తువులే! ఆమె కుతూహలానికి, ఆసక్తికి తగినట్లుగా భాష, శైలి ఉన్నాయి. కుటుంబానికి, జీవితానికి సంబంధించిన ఎన్నో విషయాలు ఆమె రచనకు శీర్షికలే! మాండలిక ధోరణి ఆమె కథానికా రచనకు వన్నె తెచ్చాయి.

ఆమె నిర్ణయించుకున్న వస్తువునుబట్టి కథానికలు మరీ పెద్దవి కావు. చదివించే గుణంతో పాటు ఆకర్షణీయంగా వర్ణించే శక్తి ఆమె కలానికి వన్నె తెచ్చింది. ఒక నిర్దిష్టమైన విషయాన్ని కాని, బలమైన భావమనికాని లేకుండా ఆవిడ కళ్ళకు నచ్చిన వాటిని, మనసును ఆకర్షించిన ప్రతి విషయాన్ని ఆవిడ కథానికగా మలిచారు.

''పూలరెమ్మ'' కథకు సుకుమారమైన వస్తువుతో వర్ణించడం, ''రాతి గుండె'' కథలో జాలిలేని మనుష్యుల కథను గురించి మనసుకు హత్తుకునేటట్టు వర్ణించారు. అందుకోలేని అనురాగం, ఓ ప్రేమ కథ, తొలి వెలుగు, దీపాలు వెలిగాయి, వెన్నెల వెలుగు మొదలైన కథల్లో రాజ్యలక్ష్మిగారు సున్నితమైన భావాలతో, సాధారణ సమస్యలను ఆసక్తికరంగా వర్ణించి పాఠకాదరణ పొందటం ఆమె రచనాశైలి అని చెప్పాలి. 'తస్మాత్‌ జాగ్రత్త' కథలో నమ్మించి తిరిగే స్త్రీయే నేర్పుతో ఏ విధంగా దొంగతనం చేసిందీ చెప్పారు. ఆమె దొంగతనం చెయ్యడం ఎవరూ చూడలేదు. రచయితే చెప్పగలిగింది. 'బ్రహ్మలిఖితం' కథలో మనం సాధారణంగా అనుకునే వాడుక మాటను కథగా మలచి చూపించారు. సంప్రదాయపు నమ్మకాన్ని వమ్ము చెయ్యకుండా రచించిన కథయిది. 'ప్రేమదీపం' వంటి ప్రేమ కథలు ఈ సంపుటిలో ఎక్కువగా చోటు చేసుకున్నాయి.

ఈ రచయిత్రి ఈ నాటి కాల పరిస్థితులకు అనుగుణంగా మరిన్ని సమస్యలను, సమస్యలుగా చిత్రించి ఆధునిక తరానికి ఆదర్శంగా, కథానికా రచన చేయాలని కోరుకుంటున్నాను. పుష్కలమైన భావ సంపద, భాషా సంపద ఏ రచనకైన దోహదకారి అవుతాయి. నిరాడంబరమైన శైలి, చక్కని చిక్కని సంభాషణలు, సహజ సిద్ధమైన వర్ణన ఆవిడ రచనకు పునాదులు. ఇటువంటి కథానికలు రచించిన రాజ్యలక్ష్మిగారికి అభినందనలు.

- డా. వాసా ప్రభావతి

Preview download free pdf of this Telugu book is available at Brahma Likhitham